ఆ పచ్చబొట్టు చెరిగిపోయిందా సమంత?

నాగచైతన్యతో ప్రేమలో ఉన్న టైమ్ లో, ఆ తర్వాత అతడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని పచ్చబొట్లు వేయించుకుంది సమంత. వాటిలో కొన్ని సీక్రెట్ టాటూలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ సీక్రెట్ టాటూ…

నాగచైతన్యతో ప్రేమలో ఉన్న టైమ్ లో, ఆ తర్వాత అతడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని పచ్చబొట్లు వేయించుకుంది సమంత. వాటిలో కొన్ని సీక్రెట్ టాటూలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ సీక్రెట్ టాటూ ఒకటి బయటపెట్టింది కూడా. పక్కటెముకులకు కాస్త పైన వేయించుకున్న పచ్చబొట్టు అది. అది నాగచైతన్య ముద్దు పేరు.

భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా చాన్నాళ్ల పాటు ఆ పచ్చబొట్టు అలానే ఉండిపోయింది. 2-3 ఫొటోషూట్స్ లో బయటపడింది కూడా. అలా బయటపడిన ప్రతిసారి కథనాలు కూడా వచ్చాయి. భర్తకు దూరమైనా, అతడి ముద్దుపేరును మాత్రం సమంత వదిలించుకోలేకపోయిందంటూ స్టోరీలు వచ్చాయి.

ఎట్టకేలకు ఆ పచ్చబొట్టును కూడా వదిలించుకుంది సమంత. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫొటోల్లో, ఆ ప్లేస్ లో 'చై' అనే పచ్చబొట్టు మాయమైంది. ఇప్పుడిదే డిస్కషన్ పాయింట్ గా మారింది.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సమంత ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ తీసుకొని మరీ ఆ పచ్చబొట్టును వదిలించుకుందని కొందరు, మరికొందరు మాత్రం మేకప్ వేసి కవర్ చేసిందని, ఇంకొందరు మాత్రం ఫొటోషూట్ తర్వాత ఫొటోషాప్ లో ఆ పచ్చబొట్టును మాయం చేశారని.. ఇలా రకరకాలుగా వాదించుకోవడం మొదలుపెట్టారు.

ఈ వాదనలు, కామెంట్స్ సంగతి పక్కనపెడితే.. ఇకపై సమంత, ఆ సీక్రెట్ ప్లేస్ లో పచ్చబొట్టు కనిపించకుండానే మేనేజ్ చేయబోతోందనేది వాస్తవం. బయట కనిపించినా, ఫొటోషూట్స్ కు పోజులిచ్చినా ఆ ప్లేస్ లో చై అనే టాటూ మాత్రం కనిపించదు. అక్కడ నిజంగా అది ఉందా, లేక సమంత తీయించేసుకుందా అనేది ఆమె వ్యక్తిగతం.

అన్నట్టు సమంత పెంపుడు కుక్కపిల్ల ఇప్పుడు నాగచైతన్య వద్దే ఉంటోంది. సమంత విదేశాల్లో ఉన్న కారణంగా, తన పెంపుడు కుక్కను తన మాజీ భర్త నాగచైతన్యకు అప్పగించినట్టు తెలుస్తోంది. తాజాగా చైతూ, సమంత కుక్కపిల్లతో ఫొటో కూడా దిగాడు.