దిల్ రాజు- అరవింద్.. మధ్యలో బాలయ్య

నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు శుక్ర మహా దశ నడుస్తోంది. ఒకప్పుడు బాలయ్య సినిమాలు, కాంబినేషన్లు, నిర్మాతలు వేరు. ఇప్పుడు వేరు. సరైన కాంబినేషన్, కథ అన్నీ కుదిరితే తప్ప పట్టాలు ఎక్కించడం లేదు. అదే…

నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు శుక్ర మహా దశ నడుస్తోంది. ఒకప్పుడు బాలయ్య సినిమాలు, కాంబినేషన్లు, నిర్మాతలు వేరు. ఇప్పుడు వేరు. సరైన కాంబినేషన్, కథ అన్నీ కుదిరితే తప్ప పట్టాలు ఎక్కించడం లేదు. అదే టైమ్ లో చాలా ఫాస్ట్ గా సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. 

భగవంత్ కేసరి ఇలా విడుదలయిందో లేదో అలా వెంటనే బాబీ సినిమా మీదకు వెళ్లిపోయారు. ఆ తరువాత బాలయ్యతో సినిమాలు చేయడానికి లైన్ లో చాలా మంది నిర్మాతలు వున్నారు, దర్శకులు వున్నారు. అయితే ఎవరితో చేస్తారు అన్నది డిసైడ్ కావాల్సి వుంది.

అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ బాలకృష్ణతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కు ఎప్పటి నుంచో బాలకృష్ణతో సినిమా చేయాలని కోరిక. ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియదు. వంశీ పైడిపల్లిని లైన్ లో అదే పని మీద వుంచారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఒక మాంచి కథను బాలయ్య కోసం తయారు చేసే పనిలో వున్నారు.

అల్లు అరవింద్ కు కూడా ఓ సినిమా బాలయ్యతో చేయాలని వుంది. ఆయనకు వున్న అడ్వాంటేజ్ ఏమిటంటే బాలయ్య కు నచ్చిన దర్శకుడు బోయపాటి డేట్స్ అరవింద్ దగ్గరే వున్నాయి. కానీ బోయపాటికి సూర్యతో ఓ సినిమా చేయాలని వుంది. కానీ బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే అది వేరే లెవెల్.

ఇలా మొత్తం మీద ఇద్దరు అగ్ర నిర్మాతలు బాలయ్య తో సినిమా చేయాలని కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.