‘దిల్ రుబా’ న్యూ ఏజ్ సినిమా

“దిల్ రూబా”కు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు.

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ “దిల్ రుబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. “దిల్ రుబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు హీరో కిరణ్ అబ్బవరం.

– “దిల్ రూబా” సినిమా నిన్న ఫైనల్ గా చూసుకున్నాం. మూవీ ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ అందరికీ బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ “దిల్ రుబా”ను బాగా ఇష్టపడతారు. ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.

– “దిల్ రూబా”లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఎక్స్ లవర్ ప్రెజెంట్ లవర్స్ ను కలపడం కొత్తగా ఉంటుంది. ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ “దిల్ రూబా”లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్ ను మా మూవీలో చూస్తారు.

– “దిల్ రూబా” సిద్ధు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్ లో మూవీ సాగుతుంది. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో హీరోలు క్యారెక్టరైజేషన్స్ లా ఇందులో హీరో సిద్ధు నమ్మే సిద్దాంతం, అతను చెప్పే మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పడు, అతని ఫ్యామిలీలో జరిగిన ప్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. హీరో చెప్పే డైలాగ్స్ హిట్టింగ్ గా ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ తో మూవీ అంతా ప్యాకేజ్ లా ఉంటుంది.

– “దిల్ రూబా”కు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు. అంటూ ముగించారు కిరణ్ అబ్బవరం.

3 Replies to “‘దిల్ రుబా’ న్యూ ఏజ్ సినిమా”

Comments are closed.