ఎఫ్ 2…బ్లాక్ బస్టర్. ఆ ఆనందం, ఆ భరోసా, ఆ ధైర్యంతోనే నిర్మాత దిల్ రాజు ఎఫ్ 3 సినిమా నిర్మాణానికి దిగారు. ఎఫ్ 3 కూడా బాక్సాఫీస్ దగ్గర స్టడీగానే వుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఎఫ్ 4 వుంటుందని దిల్ రాజు ప్రకటించారు. సినిమాలో ఎండ్ కార్డ్స్ లో ఆ విషయం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ధైర్యం దిల్ రాజు చేయగలరా? అన్నది సందేహం.
ఎఫ్ 3 సినిమా ప్రారంభంలో దిల్ రాజు చాలా ఇబ్బందుల పడ్డారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల విషయంలో. ఎఫ్ 2 కి ఇచ్చిన రెమ్యూనిరేషన్లు డబుల్ చేస్తే తప్ప ఇద్దరు హీరోలు అంగీకరించలేదని బోగట్టా. పైగా సినిమా నిండా సీనియర్, నోటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు. బోలెడన్ని వర్కింగ్ డేస్.
కేవలం రెమ్యూనిరేషన్లే 35 నుంచి 40 కోట్లు బిల్లింగ్ అయిందని బోగట్టా. సినిమా నిర్మాణం మొత్తానికి 75 కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది. లాభసాటి ప్రాజెక్ట్ నే.
ఎందుకంటే ఆంధ్ర 30 కోట్ల రేషియో, సీడెడ్ 11 కోట్లు, నైజాం స్వంత విడుదల అయినా 15 నుంచి 20 మధ్యలో వాల్యూ వుంటుంది. నాన్ థియేటర్ ఎలానూ వుంది. కానీ ఎఫ్ 4 తీయాలంటే ఈ 75 కోట్లకు దాటుతుంది కానీ తగ్గదుపైగా మరో హీరోను తీసుకుంటాం అని కూడా చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. అలా అయితే మరో పది కోట్లు యాడ్ చేసుకోవాలి. అలా అయితే ప్రాజెక్టు లాభసాటి కాదు.
మరీ అధ్భుతమైన కథ దొరికితే, హీరోలు రెమ్యూనిరేషన్ గురించి పట్టుపట్టకుండా ముందుకు వస్తే తప్ప ఎఫ్ 4 చేయడానికి నిర్మాత దిల్ రాజు ధైర్యం చేయకపోవచ్చు. ఈలోగా అనిల్ రావిపూడి అటు బాలయ్యతో ఆ తరువాత ఎన్టీఆర్ లేదా మహేష్ తో సినిమాలు చేయాల్సి వుంది.