నిజంగా ఆయన మనసు ‘కోనేరు’

కొంతమందికి అదృష్టం అలా కలిసొస్తుంది. రమేష్ వర్మ కూడా ఆ కోవలోకే వస్తాడు. ఖిలాడీ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఈ దర్శకుడు క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. Advertisement లారెన్స్ కెరీర్ లో ల్యాండ్…

కొంతమందికి అదృష్టం అలా కలిసొస్తుంది. రమేష్ వర్మ కూడా ఆ కోవలోకే వస్తాడు. ఖిలాడీ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఈ దర్శకుడు క్రేజీ ఆఫర్ అందుకున్నాడు.

లారెన్స్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. హీరోగా లారెన్స్ కు కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ సెక్షన్ ఆడియన్స్ ను, మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలాంటి నటుడితో సినిమా చేయబోతున్నాడు రమేష్ వర్మ.

పాన్ ఇండియా లెవెల్లో యాక్షన్ ఎడ్వంచరస్ మూవీగా ఈ సినిమాను తీయబోతున్నారు. నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.

రెండేళ్లకు పైగా సినిమా ఆఫర్ లేని రమేష్ వర్మకు ఇది బంపరాఫర్. ఈ విషయంలో నిర్మాతను మెచ్చుకోవాలి. ఇంతకుముందు రమేష్ వర్మతో రాక్షసుడు, ఖిలాడీ సినిమాల్ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ, మరోసారి ఇదే దర్శకుడికి అవకాశం ఇవ్వడం విశేషం. నిజంగా ఈ నిర్మాత మనసు ‘కోనేరు’.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్స్ ఇవే. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ లాంటి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

10 Replies to “నిజంగా ఆయన మనసు ‘కోనేరు’”

  1. Avinash Reddyని పెట్టి యాత్ర 3 తీయొచ్చు కదా, సూపర్ క్రేజీ కాంబినేషన్ లో , ఏమంటావ్ GA!!

Comments are closed.