బాబు స‌ర్కార్‌పై ర‌గులుతున్నారు!

ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల తాము వైద్య విద్య‌కు దూర‌మ‌య్యామ‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు.

డాక్ట‌ర్ కావాల‌నే విద్యార్థుల ఆశ‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ నీళ్లు చ‌ల్లింది. వైద్యాన్ని ప్రైవేట్‌ప‌రం చేయాల‌నే కుట్ర‌లో భాగంగా కొత్త‌గా ప్రారంభించాల్సిన ఐదు వైద్య క‌ళాశాల‌ల్లో కేవ‌లం ఒక చోట మాత్ర‌మే ఏర్పాటుకు చంద్ర‌బాబు స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో వంద‌లాది మెడిసిన్ సీట్లు రాష్ట్రానికి రాకుండా పోయాయి. కేవ‌లం చంద్ర‌బాబు స‌ర్కార్ అనాలోచిత విధానాల కార‌ణంగా వంద‌లాది మంది విద్యార్థులు వైద్య విద్య‌కు దూరం కావాల్సిన దుర‌వ‌స్థ ఏర్ప‌డింది.

జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో వైద్య క‌ళాశాల లేని ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. మొత్తం 17 వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేయ‌డానికి నాబార్డు నుంచి రూ.8 వేల కోట్ల‌కు పైగా రుణాన్ని వైసీపీ ప్ర‌భుత్వం పొందింది. గ‌త ఏడాది మొద‌ట‌గా ఐదు వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రారంభించారు. ఒక్కో కాలేజీలో 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు మ‌న రాష్ట్రానికి ద‌క్కాయి. దీంతో వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌నే పిల్ల‌ల కోరిక కొంత వ‌ర‌కు నెర‌వేరింది.

ఈ ఏడాది మ‌రో ఐదు వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ భావించారు. ఇందులో భాగంగా పులివెందుల‌, పాడేరు, మ‌ద‌న‌ప‌ల్లె, మార్కాపురం, ఆదోనిలో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి 750 సీట్ల‌తో వైద్య విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు ఇవ్వాల‌ని నాడు వైసీపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది.

అయితే వైసీపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగ‌డం , కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ప్రాధాన్యాలు మారిపోయాయి. కేవ‌లం పాడేరులో మాత్రమే 50 సీట్ల‌తో ఈ ఏడాది అడ్మిష‌న్లు ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. పులివెందుల‌లో క‌ళాశాల‌ను ప్రారంభించుకోవ‌చ్చ‌ని నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమ‌తులు ఇచ్చినా, ప్ర‌భుత్వం మాత్రం తాము సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేమని లేఖ రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

అస‌లు పులివెందుల మెడిక‌ల్ క‌ళాశాల‌కు ఎన్ఎంసీ అనుమ‌తులు ఇవ్వ‌డం విస్మ‌యం క‌లిగించింద‌ని స్వ‌యాన రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. స‌త్య‌కుమార్ మాట‌ల‌తో నీట్ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు విస్మ‌యానికి గురి అవుతున్నారు.

ఈ ఏడాది నీట్‌లో 43,750 మంది విద్యార్థులు అర్హ‌త సాధించారు. వీరిలో 13,849 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. వైద్య సీట్ల‌ను గ‌మ‌నిస్తే.. క‌న్వీన‌ర్ కోటా (ఫ్రీ సీట్లు) 3,850, మేనేజ్‌మెంట్ కోటా 1050-1100, ఎన్ఆర్ఐ కోటా 447, మిగిలిన సీట్లు ఆల్ ఇండియా కోటా (ప్ర‌తి క‌ళాశాల‌లో 15 శాతం) కింద మొత్తం 450-500 సీట్లు వుంటాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాము అధికారంలోకి వ‌స్తే సెల్ఫ్ ఫైనాన్ష్ కోటాను ర‌ద్దు చేస్తామ‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. చంద్ర‌బాబు త‌న హామీని నిల‌బెట్టుకుని వుంటే సుమారు 300 సీట్లు క‌న్వీన‌ర్ కోటా కింద ద‌క్కేవి. కానీ తాము కూడా సెల్ఫ్ ఫైనాన్ష్ కోటాను కొన‌సాగిస్తామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ కోర్టుకు అఫిడ‌విట్ స‌మ‌ర్పించింది.

కొత్త కాలేజీల ఏర్పాటులో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్దేశ పూర్వ‌కంగానే నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శించింది. క‌ళాశాల‌ల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల‌కు ధారాద‌త్తం చేయ‌డానికే జాప్యం చేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో నీట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు సీట్లు లేక‌పోవ‌డంతో వైద్య విద్య‌ను చ‌ద‌వాల‌న్న కోరిక‌ను చంపుకోవాల్సి వ‌స్తోంది.

డ‌బ్బున్న వాళ్లు మాత్రం బెల్జియం, అమెరికా, ర‌ష్యా, పిలిప్పైన్స్‌, చైనా, ఉక్రెయిన్ దేశాల‌కు వైద్య విద్య కోసం వ‌ల‌స వెళ్లాల్సిన ప‌రిస్థితి. ఇలా ఏడాదికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది విద్యార్థులు వెళుతున్నట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల తాము వైద్య విద్య‌కు దూర‌మ‌య్యామ‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు. త‌మ ఉసురు త‌గ‌ల‌కుండా ఉండ‌ద‌ని శ‌పిస్తున్నారు.

9 Replies to “బాబు స‌ర్కార్‌పై ర‌గులుతున్నారు!”

  1. Central govt funds ఇచ్చిన colleges కాకుండా ఈ 5 yrs లో మీరు complete చేసిన ఒక్క college ఐనా ఉందా సిగ్గులేని GA….

  2. medical colleges valla chaala upyogam vundi . paaderu lanti agency prannthallo vidya sadupayalu peruguthaei .

    medical college ki anubandanga 200 bed hospital vuntundi .

    CBN gov failed to get single medical college during 2015-2019 central scheme . ow it is very unfortunate to gov itself moving away from already constructed medical colleges .

Comments are closed.