డైరెక్టర్స్ రెడీ… హీరోస్ సారీ!

తక్కువ మంది యూనిట్ సభ్యులతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్స్ చేసుకోవచ్చునని భావించారు. కానీ ఇరవై, ముప్పయ్ మంది సిబ్బందితో చేసిన టీవీ సీరియల్స్ షూటింగ్‌లోనే పలువురు నటులు, ఇతర బృందానికి కరోనా…

తక్కువ మంది యూనిట్ సభ్యులతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్స్ చేసుకోవచ్చునని భావించారు. కానీ ఇరవై, ముప్పయ్ మంది సిబ్బందితో చేసిన టీవీ సీరియల్స్ షూటింగ్‌లోనే పలువురు నటులు, ఇతర బృందానికి కరోనా సోకడంతో షాక్ తిన్నారు. కరోనాని జయించడం లేదా బైపాస్ చేయడం అంత తేలిక కాదని అందరూ రియలైజ్ అయ్యారు. అందుకే పెద్ద సినిమాల షూటింగ్స్ కోసం వేసుకున్న ప్రణాళికలు రద్దు చేసుకున్నారు.

షూటింగ్స్ చేయడానికి దర్శకులు కదన కుతూహలం చూపిస్తున్నా కానీ హీరోలు, హీరోయిన్లు మాత్రం ససేమీరా అనేస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్ మొదలు పెట్టడానికి రాజమౌళి ఎన్నో స్కెచ్‌లు వేసాడు. మాక్ షూట్ చేసి, అందరిలోను నమ్మకం పెంచాలని కూడా చూసాడు. కానీ రాజమౌళి మాటని తన హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా వినే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితులు రిస్క్‌తో కూడుకున్నవి కనుక వేచి చూడాలనే ఇద్దరూ ‘జక్కన్న’కి చెప్పారట.

హైదరాబాద్‌లోనే వుండే హీరోలే షూటింగ్‌కి ససేమీరా అంటే, ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ెటల్స్‌లో బస చేయాల్సిన హీరోయిన్లు, ఇతర నటులు ఎలా అంగీకరిస్తారు. సెప్టెంబర్ వరకు షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితే లేదని కొందరు అంటుంటే, కొందరయితే ఈ ఏడాదిని మరచిపోవచ్చునని, వచ్చే ఏడాదికి పరిస్థితి చక్కబడితే అదే పెద్ద విషయమని అంటున్నారు. 

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే