మేషం: ఈతిబాధలు, అవస్థల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని వివా దాలు పరిష్కారమవుతాయి. ఆర్థికం…కొంత వెలు సుబాటు కలుగుతుంది. రావలసిన డబ్బు కొంతలో కొంత అందే అవకాశాలున్నాయి. అయితే పూర్తి సంతప్తి కలగదు. కుటుంబం…అందరితోనూ ప్రేమగా మసలుకుంటారు. ఆప్యాయత, అనురాగాలు చూపు తారు. వివాహాది వేడుకలు కొన్ని రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. ఆరోగ్యం…ప్రత్యేకించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కొద్దిపాటి రుగ్మతలు బాధి స్తాయి. వ్యాపారాలు…అనుకున్న విధంగా లాభాలు పొందేందుకు కష్టపడి ఫలితం సాధిస్తారు.ఉద్యోగాలు.. విధుల్లో ప్రతిబంధకాలు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇష్టంలేని మార్పులు బాధిస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు అంచనాలు కొంత ఫలిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృషభం: అనుకున్న వ్యవహారాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రులు, సన్నిహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి.ఆర్థికం.. డబ్బుకు ఇబ్బంది పడ్డా అవసరాలు తీరతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి.ఆకస్మికంగా కొంత డబ్బు అందే సూగీె నలు. కుటుంబం…మీ మాటంటే కుటుంబంలో ఎదురుండదు. అయితే, తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. నిదానం పాటించండి. ఆరోగ్యం….కొంత మెరుగుదల కనిపిస్తుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలు.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించక స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగాలు….మీపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మిథునం: కొత్త పనులు చేపట్టి కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. ఆర్థికం.. రావలసిన డబ్బు అందుకుంటారు. ఇతరులు కూడా మీకు కొంత సహాయం అందిస్తారు. భూములు విక్రయాలు పూర్తి చేసి కొంతసొమ్ము అందుకుంటారు. కుటుంబం….మీఅంచనాలు నిజం చేసుకుంటారు. కొన్ని వేడుకలు క్లుప్తంగా నిర్వహించి ఒడ్డునపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం….కొద్దిపాటి రుగ్మతలు బ్యాధిస్తాయి. వైద్యసేవలు తప్పనిసరి కావచ్చు. వ్యాపారాలు..విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు.. పనిభారం కాస్త తగ్గి ఉపశమనం పొందుతారు. పదోన్నతులలో స్వల్ప ఆటంకాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చికాకులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తా యి. ఎంత అనుకూలత ఉన్నా ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థికం…సొమ్ములకు లోటు ఉండదు. ఏదో విధంగా అందుతునే ఉంటుంది. అవసరాలు తీరతాయి. కుటుంబం….సంతోషకరమైన వాతావరణంలో గడు పుతారు. పెద్దల సలహాలు , సూచనలు పాటిస్తూ నిర్ణ యాలు తీసుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తా రు. ఆరోగ్యం…కాస్త మందగిస్తుంది. అయినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు….క్రమేపీ పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగాలు….కొన్ని మార్పులు ఇష్టం లేకున్నా తప్పకపోవచ్చు. బాధ్యతలు కూడా పెరుగు తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉపశమనం లభించే సమాచారం అందుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది.
సింహం: ఎంతగా కష్టపడ్డా అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ప్రస్తుత పరిస్థితులు కూడా మీకు తలనెప్పిగా మారి ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థికం…రుణసేకరణ తప్పదు. మరోవైపు ఆస్తుల విక్రయాలు స్థంభించి రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. కుటుంబం…సంతానం ఆరోగ్యంపై కొంత కలత చెందుతారు. కొన్ని వేడుకలు చివరిలో వాయిదా వేస్తారు. సోదరులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం…ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకావచ్చు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు.. కొంతమేర లాభాలు అందుతాయి. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలు… అద నపు పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. కొన్ని మార్పులు కూడా జరిగే వీలుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి. మహిళ లకు సోదరీలతో వివాదాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.
కన్య: కొత్త వ్యవహారాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. ఆర్థికం…సొమ్ములు అంది అవసరాలు తీరతాయి. షేర్ల విక్రయాలు ఎట్టేకలకు పూర్తి చేసి కొంత డబ్బు అందుకుంటారు. కుటుంబం.. అందరితోనూ ప్రేమగా మసలుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. మీ ఆప్యాయతకు బంధువులు పులకిస్తారు. ఆరోగ్యం….మరింత మెరుగుపడుతుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలు…అనుకున్న లాభాలు పొంది ఊరట చెందుతారు. కొత్త భాగస్వాములు చేర తారు. ఉద్యోగాలు…ఒడిదుడుకులు క్రమేపీ తొలగుతాయి. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్య పరుస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రభావం కొంత ఎదు రైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆధ్యా త్మిక కార్యక్ర మాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రు లతో ఉత్త రప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థికం.. రావల సిన డబ్బు అందుతుంది. అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. రుణాలు తీరతా యి. కుటుంబం…అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. ఆస్తు ల విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం.. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు… క్రమేపీ వద్ధి చెందుతాయి. అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగాలు…విధుల్లో నెలకొన్న సమస్యలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామిక వర్గాలు, కళాకారులకు కాస్త అనుకూలత ఉంటుంది. మహిళలకు స్వల్ప ధనలాభం. పశ్చిమదిశ ప్రయాణా లు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
వశ్చికం: నూతనోత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సానుకూలం చేసు కుంటారు. ఆర్థికం….ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొంత ఇబ్బంది కలిగినా ప్రధాన అవసరాలకు ఇబ్బందులు కలగవు. అయితే రుణదాతలను ఆశ్రయిస్తారు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.కుటుంబం….బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వారి అభిప్రాయాలను సేకరించి ముందుకు సాగుతారు. సంతానపరంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం…ఇంతకాలం వేధించిన రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు….ఆశించి విధంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు….బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అనుభవాన్ని చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్నకార్యసిద్ధి. మహిళలకు ఆస్తిలాభం ఉండవచ్చు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: వారమంతా మీదే పైచేయిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికం… ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన అవస్థలు తొలగుతాయి. రుణబాధలు కూడా తొలగే సమయం. కుటుంబం.. కుటుంబసభ్యులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. ఎటువంటి బాధ్యత అయినా అవలీలగా పూర్తి చేస్తారు. విదేశాలలో ఉన్న వారి క్షేమసమాచారం ఊరట కలిగిస్తాయి. ఆరోగ్యం.. కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం లభిస్తుం ది. వ్యాపారాలు.. విస్తరణ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలు.. విధుల్లో మీ సత్తా చాటుకుంటారు. పైస్థాయి వారి నుంచి సహా యం అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు సమస్యలు, చికాకులు తొలగుతాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కాకే రవాష్టకం పఠించండి.
మకరం: క్రమేపీ పరిస్థితులు అనుకూలించి అడుగు వేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థికం…కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి విక్రయాలు పూర్తి చేసి మరింత డబ్బు సమకూర్చుకుంటారు. కుటుంబం….అందరి ప్రేమానురాగాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు. ఆరోగ్యం….క్రమేపీ మెరుగై ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు….కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. అనుకున్నంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు.. కొత్త విధులు చేపడతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ప్రారంభంలో వివిధ రూపాల్లో ఇబ్బందులు నెలకొన్నా తట్టుకుని ముందుకు సాగుతారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆస్తి వివాదా లు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థికం….కొత్త ఆశలు చిగురిస్తాయి. రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. షేర్ల విక్ర యాలు సకాలంలో పూర్తి చేసి డబ్బు అందుకుంటారు. కుటుంబం…అందరితోనూ సంతోషంగా గడుపుతారు. వివాహాది వేడుకల నిర్వహణలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. సంతాన విషయంలో భయాం దోళనలు తొలగుతాయి. ఆరోగ్యం….కొంత మెరుగు పడి ఊరట చెందుతారు. వ్యాపారాలు….క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. పెట్టుబడులు సమకూరతా యి. ఉద్యోగాలు.. కోరుకున్న మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారుల సలహాల మేరకు నడుచుకుని ప్రశంసలు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకా రులకు చిక్కులు తొలగుతాయి. తూర్పుదిశ ప్రయాణా లు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కుతారు. ఆర్థికం…సొమ్ముకు ఇబ్బందులు లేకుండా గడుపుతారు. ఆస్తులు విక్రయాలలో అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. కొంత మేర రుణాలు సైతం తీరతాయి. కుటుంబం.. కుటుంబసభ్యుల వైఖరి మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ సర్దుకుంటుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. విదేశాలలోని సంతానం క్షేమ సమాచారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం.. కాస్త మెరుదల కనిపిస్తుంది. వైద్యసేవలు కొనసాగిస్తారు. వ్యాపారాలు…అనుకున్న లాభాలతో ముందుకు సాగుతారు. కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. ఉద్యోగాలు…విధులలో ఆటంకాలు అధిగమిస్తారు. సందిగ్ధత తొలగుతుంది. ఉన్నతాధికారులు మీపట్ల ఆదరణ చూపుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది. మహిళలకు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
Vakkantham Chandra Mouli
www.janmakundali.com