నిన్న బాయ్ కాట్.. ఈరోజు డిజాస్టర్

పృధ్వీపై చాలామందికి ఇంకా కోపం చల్లారలేదు. దీంతో ఈరోజు రిలీజైన లైలా సినిమాపై “డిజాస్టర్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

పృధ్వీ సారీ చెప్పినా వేడి చల్లారలేదు. లైలా సినిమాపై సోషల్ మీడియాలో ఆగ్రహం కనిపిస్తూనే ఉంది. నిన్నటివరకు బాయ్ కాట్ లైలా ట్రెండ్ నడవగా.. రాత్రి నుంచి డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

లైలా సినిమా ప్రచార వేదికపై నటుడు పృధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదంటూనే ఆయన సినీ వేదికను వాడుకున్నారు. ఆ ప్రభావం విశ్వక్ సేన్ సినిమాపై గట్టిగా పడింది.

దీంతో చివరి నిమిషంలో పృధ్వీ లైన్లోకి వచ్చారు. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే సారీ అంటూ భేషరతుగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

ఇకపై బాయ్ కాట్ లైలా అనకుండా వెల్ కం లైలా అనాలని, సినిమాను పెద్ద హిట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే పృధ్వీపై చాలామందికి ఇంకా కోపం చల్లారలేదు. దీంతో ఈరోజు రిలీజైన లైలా సినిమాపై “డిజాస్టర్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇలా తీవ్ర వ్యతిరేకత మధ్య ఈరోజు లైలా సినిమా థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ వేశాడు.

28 Replies to “నిన్న బాయ్ కాట్.. ఈరోజు డిజాస్టర్”

  1. వైకాపా వాళ్ళు జగన్ 2019-24 లో చేసిన మంచి గురించి ఎంతో కొంత “బాన్ లైలా కి” పెట్టిన శ్రద్హ లో 1 % పెట్టి ప్రచారం చేసినా 2024 ఎన్నికలలో ఘోర ఓటమి వచ్చి ఉండేది కాదు…. వైకాపా క్యాడర్ స్థాయి జగన్ స్థాయి లో ఉండాలి కానీ, టయర్ 2 లీడర్ ప్రిథ్వి లేక అస్సలు నాయకుడు అవునో కాదో కూడా తెలియని కిరాక్ rp, హైపర్ ఆది స్థాయిలో కాదు…. వాళ్లు ఏమి మాట్లాడినా వీరావేశం తో ఊగిపోతారు క్యాడర్ అంతా…. ఎవ్వరి మాటలు పట్టించుకోవాలో కూడా తెలియదు అనుకుంట…. వైరి పక్షం మీద ఎన్ని కోపాలు ఉన్న కూడా ఎవ్వరు ban heritage or ban bharathi cement ఇలాంటి టాగ్లు నేను చూడలేదు ఏ పార్టీ క్యాడర్ నించి…. బాన్ సినిమా మాత్రం అది రాజకీయాల్లో లేని విశ్వక్ సినిమాని బాన్ చేసెయ్యాలి…..అదే సినిమా డిసాస్టర్ అవ్వగానే మా వల్లే అయిందని ఆనంద పడాలి…

Comments are closed.