ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో.. తమ అనుకూలులను అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలో లేదు గనుక.. తెలుగుదేశం అభ్యర్థుల విజయం అనేది కేక్ వాక్ అయిపోతుందని, పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల బరిలో ఉన్న అభ్యర్థులు సైలెంట్‌గా ఇంట్లో కూర్చున్నా సరే.. ఎమ్మెల్సీ పదవి వారిని వరించి వచ్చేస్తుందని ఆ పార్టీ వారు రకరకాల భ్రమల్లో ఉన్నారు. వైసీపీ బరిలో ఉంటే కూడా తామే గెలిచి తీరుతామని వారు విర్రవీగినా ఆశ్చర్యం లేదు. అయితే కేవలం వైసీపీ బరిలో లేకపోవడం వల్ల.. గుంటూరు-కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలుగుదేశానికి ఎదురుదెబ్బ తగలవచ్చుననే అభిప్రాయం పలువురిలో ఏర్పడుతోంది.

జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కోసం తన తెనాలి సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా.. అందుకు ప్రత్యామ్నాయంగా తనకు దక్కిన ఎమ్మెల్సీ ఆఫర్‌ను వినియోగించుకుని గెలిచే అవకాశాలు తక్కువే అని పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వైసీపీ చాలా కాలం ముందుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు గమనిస్తే.. ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు కలగడం లేదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని పార్టీ తేల్చేసింది. విజయం ఏకపక్షం అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. సాధారణ పరిస్థితుల్లో అలా జరగవలసిందేనేమో గానీ.. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఆలపాటి రాజా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

అక్కడ వామపక్షాల తరఫున ఉపాధ్యాయ సంఘాలతో సన్నిహితంగా ఉండే ఏఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఆ రెండు జిల్లాల్లోని దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో అనుబంధం ఉంది. అలాగే వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక, ట్రేడ్ యూనియన్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీటి పర్యవసానంగా.. ఆయా సంఘాలకు చెందిన పట్టభద్రుల ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే పడే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.

దానికి తోడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో.. తమ అనుకూలులను అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది. ఇప్పుడు ఆ ఓటర్లందరూ కూడా ఏఎస్ లక్ష్మణరావుకు అనుకూలంగానే ఓటు వేసే అవకాశం ఉంది. వైసీపీ బరిలో లేకపోయినప్పటికీ.. వారి ఓటు బ్యాంకు మొత్తం లక్ష్మణరావుకు అదనపు బలం అవుతుంది.

ఇలాంటి నేపథ్యంలో ఆలపాటి రాజా నెగ్గుకురావడం అంత సులువు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. “అధికార పార్టీలో ఉన్నాం కదా.. గెలిచి తీరుతాం” అనుకుంటే ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారు.

13 Replies to “ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!”

  1. ఏంది బాబు వైకాపా తమ అనుకూలురు అందరిని గ్రాడ్యుయేట్స్ గా నమోదు చేయించిందా (మరి ఓటర్ లు వేరు అని సజ్జల ఎందుకు చెప్పారు …) అంత మంది అనుకూలురు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు వోట్ వెయ్యలేదు??? పోనీ వేశారు అనుకుందాం అప్పుడు వేసినోళ్ళేమో …ఇప్పుడు వైకాపా పోటీ చేస్తే వెయ్యరు అని మీరు ఫిక్స్ ఐపోయారా ???(అన్న ఒక్క ఛాన్స్ అని అడిగారు కాబట్టి రెండోసారి వెయ్యరు అని భయపడ్డారా)..అసలు గెలిచే అవకాశం ఉంటె అన్న పోటీ పెట్టకుండా ఊరుకుంటారా ???సరే ఐతే మీ ప్రకారం ఇప్పుడు వాళ్ళు అంతా కంమ్యూనిస్టు అభ్యర్థి కె వోట్ వేస్తె…అన్న కి కమ్యూనిస్ట్స్ లకి రహస్య ఒప్పందం జరిగింది అంటారా ???

      1. అంత ఉన్న కానీ పోటీ చెయ్యడానికి వట్ట కాయలు జారిపోతున్నాయి కదా సింగల్ సింహానికి

      2. అంత ఉన్న కానీ పోటీ చెయ్యడానికి వట్ట కాయలు జారిపోతున్నాయి కదా సింగల్ సింహానికి అని ఈడీకి కూడా ఎవరైనా చెప్పండిరా …..

          1. పట్టభద్రుల ఎన్నికకు మెజారిటీ కి సంబంధం ఏంటి సామీ…అప్పటికి పైన నీలుగుతున్నాడు కదా ఓటర్ లిస్ట్ అంతా కూడా తమ అనుకూలురు తో నింపేశారు అని…

          2. మంచిది చెట్టు కింద చిలక జోస్యాలు చెప్పుకోండి…అంతకు ముందు ఇలాంటి పిల్లి శాపాలు చిలక జోస్యాలు చాల మంది చెప్పారు…ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు….

  2. మరి అంత మంది పట్టభద్రులని నమోదు చేయిస్తే వైసీపీ నే పోటీ చేస్తే అయిపోయేదిగా?

    1. ante vallandharikee pattalu levu…tirupathi by election ki kanuka 10 samvathsrala pillalni dhonga votlu veyataaniki thechhinatlu 5 va tharagathi koodaa pass kani vallu YCP PATTABHADHRULU.

Comments are closed.