బీజేపీ నుంచి పొమ్మంటే వెళ్లిపోతా!

గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నాడు.

ఎప్పుడూ వివాదాల్లో ఉండే గోషాహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ గురించి చాలామందికి తెలుసు. హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు.  ముస్లింలను వ్యతిరేకిస్తుంటాడు. అలంటి  రాజాసింగ్​ బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నానని గగ్గోలు పెడుతున్నాడు. పార్టీ నుంచి పొమ్మంటే బయటకు వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు.

2014 లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులకు గురవుతున్నానని చెప్పాడు. పార్టీలో తన మాటకు విలువ లేదని బాగా ఆవేదన చెందుతున్నాడు. రాజాసింగ్​కు పార్టీ మీద కోపం రావడానికి, తీవ్రంగా విమర్శలు చేయడానికి కారణం ఏమిటంటే…. తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. ఎమ్మెల్యే , ఎంపీ లు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు.

ఈ నేపథ్యంలోనే తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ- గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నాడు. బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు.  పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదన్నాడు.

గోల్కొండ-గోషామహల్  జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం  పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యాడు. ఎందుకు అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని అన్నాడు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని అన్నాడు.

గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నాడు. టి. రాజాసింగ్ ఎలప్పుడూ తన పదునైన వ్యాఖ్యలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.  2009లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.  ఆయన 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మంగళ్‌హాట్ ప్రతినిధిగా సేవలు అందించాడు.

2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాడు. 2017లో, రాజాసింగ్ హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని “మినీ పాకిస్థాన్”తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు ఆయన్ని చిక్కుల్లోకి నెట్టాయి. జూన్ 2018లో, రాజాసింగ్ ఖురాన్ నిషేధానికి పిలుపునిచ్చాడు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా ముస్లిం వ్యతిరేకనని పదేపదే చెబుతూ వచ్చిన సందర్భాలు లేకపోలేదు.

ముస్లింలను దేశద్రోహులుగా పిలవడమే కాదు.. రోహింగ్యా ప్రజలపై కాల్పులకు మద్దతు ఇవ్వడం లాంటివి పెద్ద దుమారానికి దారి తీశాయి. 2023లో శివజయంతి సందర్భంగా, అహల్యనగర్ జిల్లాలోని శ్రీరామ్‌పూర్‌లో రాజాసింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అల్లర్లకు దారితీశాయి. 2020 సెప్టెంబర్ 2న, ఫేస్‌బుక్ సంస్థ రాజాసింగ్ అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేసింది.

అలాగే 2022, ఆగష్టు 23న రాజాసింగ్ చేసిన మహమ్మద్ వ్యాఖ్యల వివాదం హైదరాబాద్ నగరంలో నిరసనలకు దారి తీసింది. ఆ వెంటనే హైదరాబాద్ పోలీసులు ఆయన్నిఅరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ.. ఆయనను పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సస్పెండ్ చేసింది. మరోవైపు 27 అక్టోబర్ 2022న, రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 18 మతపరమైన నేరాలకు సంబంధించినవని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

ఇక తాజాగా అక్టోబర్ 2023లో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ.. ఆయన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీలో ఉంచింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

5 Replies to “బీజేపీ నుంచి పొమ్మంటే వెళ్లిపోతా!”

Comments are closed.