Advertisement

Advertisement


Home > Movies - Movie News

బ్లాక్ బస్టర్ సినిమా.. డిజాస్టర్ ప్లానింగ్

బ్లాక్ బస్టర్ సినిమా.. డిజాస్టర్ ప్లానింగ్

థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలకు, హిట్టయిన మూవీస్ కు ఓటీటీ ప్రమోషన్ లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ హిట్టయిన సినిమాల్ని ఓటీటీలు భుజానికెత్తుకుంటాయి, ఘనంగా ప్రమోట్ చేసి మరీ స్ట్రీమింగ్ చేస్తాయి. అదే ఫ్లాప్ అయిన సినిమాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వవు, సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమౌతుంటాయి.

కానీ హనుమాన్ విషయంలో దీనికి రివర్స్ లో జరిగింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఉన్నఫలంగా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం చాన్నాళ్లుగా ఓటీటీ జనం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇంత హైప్ ఉన్న ఈ మూవీని క్యాష్ చేసుకోవడంలో జీ5 ఫెయిలైంది. ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ కు పెట్టేసింది.

మొన్నటికిమొన్న శివరాత్రికి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఒక టైమ్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనిపై ట్వీట్ చేశాడు. మంచి ఔట్ పుట్ కోసం వెయిట్ చేయాలంటూ ఏదేదో రాసుకొచ్చాడు. కట్ చేస్తే, చడీచప్పుడు లేకుండా సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేశారు.

ఓ హిట్ సినిమాను అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఎలా క్యాష్ చేసుకుంటాయో ఆ పని జీ5 చేయలేకపోయింది. ఇప్పటికే ఈ ఓటీటీ సంస్థ, పోటీ తట్టుకోలేక కిందామీద పడుతోంది. ఇలాంటి టైమ్ లో హనుమాన్ రూపంలో అందివచ్చిన మంచి అవకాశాన్ని అది దారుణంగా మిస్ చేసుకుంది.

జీ తెలుగులో రోజూ వచ్చే సీరియల్స్ కు ఇచ్చే ప్రమోషన్ కూడా హనుమాన్ సినిమాకు ఇవ్వకపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ కావాలంటే ఆ సంస్థ చాన్నాళ్లు వెయిట్ చేయకతప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?