Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ తెరపైకి ఉస్తాద్.. ఎన్నికల కోసమా?

మళ్లీ తెరపైకి ఉస్తాద్.. ఎన్నికల కోసమా?

ఓవైపు పవన్ సినిమాలకు సంబంధించి ఎవ్వరూ ఎలాంటి అప్ డేట్స్ ఆశించడం లేదు. మేకర్స్ కూడా స్తబ్దుగా మారారు. ఎందుకంటే, పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇలాంటి టైమ్ లో ఉరుము లేని మెరుపులా, ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్ డేట్ వచ్చింది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఊహించనిది వస్తోందంటూ ఊరిస్తోంది యూనిట్. 19వ తేదీన దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. పవన్ డబ్బింగ్ చెబుతున్నట్టు 2 స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు.

ఇది కచ్చితంగా సినిమాకు సంబంధించిన అప్ డేటే. కాకపోతే ఇలాంటి టైమ్ లో ఉన్నఫలంగా ఇలా అప్ డేట్ ఇవ్వడానికి, ఏపీలో ఎన్నికలకు ఏదో సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ లో చాలా డైలాగ్స్ రాశాడు హరీశ్. చేసిన సింగిల్ షెడ్యూల్ నుంచే ఏకంగా టీజర్ కట్ చేసి వదిలాడు. ఇప్పుడు అదే ఫూటేజ్ నుంచి ఎన్నికల్లో పవన్ కు మైలేజ్ పెంచేలా ఓ డైలాగ్ లేదా సీన్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.

ఈ ఎన్నికలకు తన సినిమా సర్కిల్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు పవన్. ఇప్పటికే ఎన్నికల కోసం ఆయన ఓ ప్రచార చిత్రాన్ని తయారుచేయించి వదిలారు. ఇందులో భాగంగానే ఉస్తాద్ నుంచి కూడా 'ఊహించనిది' వచ్చేలా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?