స్క్రీన్ మీద త‌న‌ను తాను చూసుకోలేన్న హీరోయిన్!

ఆమె స్క్రీన్ ప్ర‌జెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు! బాలీవుడ్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల‌లో ఒక‌రు. ఆమె ఫొటోలు అయితే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయి. తెర‌పై అత్యంత అందంగా క‌నిపించే భామ‌గా…

ఆమె స్క్రీన్ ప్ర‌జెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు! బాలీవుడ్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల‌లో ఒక‌రు. ఆమె ఫొటోలు అయితే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయి. తెర‌పై అత్యంత అందంగా క‌నిపించే భామ‌గా ఆమెకు పేరు! ఆమె కోస‌మే థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టే జ‌నాలూ ఉన్నారు. 

సినిమాలతో వ‌చ్చిన గుర్తింపుతో సోష‌ల్ మీడియాలో బ్ర‌హ్మాండ‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్ ఆమె! ఇంత చెప్ప‌డం ఎందుకంటే.. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ త‌న‌కు న‌చ్చ‌ద‌ని ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ వ‌ల్ల‌!

దిశా పాట్నీ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది! తెర‌పై త‌ను త‌న‌కు న‌చ్చ‌నంటూ ఆమె చెప్పింది. ఒక టాక్ షో లో ఈ హీరోయిన్ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. వెండి తెర‌పై త‌నను త‌ను చూసుకోవ‌డం బ‌హుక‌ష్టం అని, ఆ అనుభ‌వం త‌ను కోరుకోనిది అని ఈ హీరోయిన్ అంటోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే తెర‌పై త‌న‌ను తాను చూసుకోవ‌డం త‌న‌కు ద్వేషంతో కూడుకున్న అంశ‌మ‌ట‌!

మ‌రి ప‌దుగురు మెచ్చిన‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరోయిన్ ఈ త‌ర‌హాలో స్టేట్ మెంట్ ఇవ్వ‌డం విచిత్ర‌మే. సాధార‌ణంగా ఇలా తెర‌పై క‌నిపించే వారికి నార్సిసిస్ట్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అంటే త‌మ‌ను తాము చూసుకుని మురిసిపోయే ల‌క్ష‌ణ‌మ‌న‌మాట‌. హీరోల‌కూ, హీరోయిన్ల‌కు ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉండ‌టంలో పెద్ద ఆశ్చ‌ర్యం ఉండ‌దు. త‌మ సినిమాలు హిట్ట‌య్యే కొద్ది, త‌మ‌కు డిమాండ్ పెరిగే కొద్దీ ఇలాంటి ల‌క్ష‌ణాలు ఎక్కువవుతాయి. ఆ ద‌శ‌లోనే వారు తాము సాధార‌ణ మ‌నుషుల్లాంటి వాళ్ల కాద‌నే భ్ర‌మ‌లోకి వ‌స్తారు.

మ‌రి ఇలాంటి ఫీల్డ్ లో ప‌ని చేస్తున్న దిశా మాత్రం త‌న ప్ర‌జెన్స్ ను త‌ను ఇష్ట‌ప‌డ‌నంటూ, తెర‌పై త‌న‌కు తాను న‌చ్చ‌నంటూ చెబుతోంది. కాస్త డిఫ‌రెంట్ స్టేట్ మెంటే!