మరో సెలబ్రిటీ పెళ్లి పెటాకులు కానుందా..?

మొన్నటికిమొన్న ధనుష్-ఐశ్వర్య విడాకులతో వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. దాదాపు 18 సంవత్సరాలు కలిసి జీవించిన ఈ జంట విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు జీవి ప్రకాష్ కూడా తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు…

మొన్నటికిమొన్న ధనుష్-ఐశ్వర్య విడాకులతో వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. దాదాపు 18 సంవత్సరాలు కలిసి జీవించిన ఈ జంట విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు జీవి ప్రకాష్ కూడా తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, మ్యూజిక్ డైరక్టర్ కమ్ నటుడు జీవీ ప్రకాష్, తన భార్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గాయని సైంధవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు జీవి ప్రకాష్. వీళ్లకు పెళ్లయి గతేడాదికి దశాబ్దం పూర్తయింది. మరో నెల గడిస్తే వీళ్లు 11 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకుంటారు.

అంతలోనే వీళ్ల వైవాహిక బంధంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా ప్రకాష్-సైంధవి మధ్య అభిప్రాయబేధాలు ఎక్కువయ్యాయట. అందుకే పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని వీళ్లు నిర్ణయించుకున్నారట.

వాళ్ల వైవాహిక బంధం పదేళ్లే కావొచ్చు. కానీ ఇద్దరూ ఒకరికొకరు చిన్నప్పట్నుంచి తెలుసు. జీవీ ప్రకాష్, సైంధవి చిన్నప్పట్నుంచి కలిసి పెరిగారు. తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి ఎన్నో సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమకు ప్రతిరూపంలో ఓ కూతురు కూడా జన్మించింది.

ఇలాంటి అన్యోన్య జంట మధ్య అభిప్రాయబేధాలు రావడం ఆశ్చర్యం. ప్రస్తుతానికైతే ఈ పుకార్లపై అటు సైంధవి, ఇటు జీవీ ఇద్దరూ స్పందించలేదు.