తాను ఎంతో హాట్ అని చాటి చెప్పేందుకు ఆమె తహతహలాడారు. అయితే ఎవరెవరి ఇష్టం వారిదని సరిపెట్టుకోవచ్చు. కానీ దేనికైనా సమయం, సందర్భం ఉండాలని అంటారు.
ఆ విచక్షణ లేకపోతే జనం హేట్ చేస్తారనేందుకు ఆ నటి హాట్ ఫొటోలే నిదర్శనం. టీవీ నటి దివ్య అగర్వాల్‌ను నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
టీవీ నటి దివ్య అగర్వాల్ తండ్రి ఇటీవల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తండ్రిని కోల్పోయిన దివ్య ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇంత వరకూ బాగా ఉంది. అయితే తండ్రి మరణించి రోజులు కూడా గడవకనే దివ్య తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కనిపించి నెటిజన్లకు షాక్ ఇచ్చారు.
తండ్రి భౌతికంగా దూరమై వారం రోజులు కూడా గడవలేని, ఆయన జ్ఞాపకాలు వెంటాడుతుండగానే నటి దివ్య ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం హాట్ భంగిమలో షూట్ చేయడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన హాట్ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
తండ్రి పోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఏంటీ పనులంటూ ఆమెను ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్ కూడా ఘాటుగా స్పందించారు.
ఈ సమాజం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుందంటూ ఎదురు దాడికి దిగారు. బాధ నుంచి కోలుకుని సంతోషంగా గడపడాన్ని జనాలు జీర్ణించు కోలేపోతున్నారని గట్టిగా బదులిచ్చారామె.