వీరావేశం వీర్రాజు.. చీకట్లో తుపాకి పేల్చారు

పోలవరంపై అందరూ మాట్లాడుతున్నారు.. తానెందుకు వెనకబడ్డం అనుకున్నారో ఏమో.. సోము వీర్రాజు అర్జెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే లెక్కల్లో మాత్రం ఆయన చాలా తడబడ్డారు.  Advertisement చంద్రబాబు 48వేల కోట్ల…

పోలవరంపై అందరూ మాట్లాడుతున్నారు.. తానెందుకు వెనకబడ్డం అనుకున్నారో ఏమో.. సోము వీర్రాజు అర్జెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే లెక్కల్లో మాత్రం ఆయన చాలా తడబడ్డారు. 

చంద్రబాబు 48వేల కోట్ల రూపాయలు ఇష్టారీతిన పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచేశారంటూనే.. జగన్ సర్కారు ఆ అవినీతిపై ఎందుకు ఎంక్వయిరీ మొదలు పెట్టలేదని లాజిక్ తీశారు. 

బాబు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పోలవరాన్ని అప్పగించినట్టే.. జగన్ కూడా తన వారికే కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారని విమర్శించారు.

మరి ఇన్ని విషయాలు తెలిసిన వీర్రాజు.. పోలవరం అవినీతిపై ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నట్టు.. పోనీ ఇప్పుడైనా కేంద్రంతో చెప్పించి అవినీతిని వెలికి తీయొచ్చు కదా? ఈ ప్రశ్నలకు మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు.

పోలవరం కాంట్రాక్టర్ చంద్రబాబేనంటూ గతంలో ఓ కేంద్ర మంత్రి సెలవిచ్చారంటున్న వీర్రాజు.. ఆయన ఎవరినైనా మేనేజ్ చేయగలరు అని చెప్పుకొచ్చారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. 

రూ. 5 కోట్ల పనుల్ని రూ.25 కోట్లకు పెంచేశారని, అప్పటి మంత్రి యనమల వియ్యంకుడికి కాంట్రాక్ట్ పనుల్ని అప్పగించారని అన్నారు. పోలవరం డబ్బుల్తో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్ మెంట్లు కట్టారని, వారి జాతకాలు బైటపెడతానన్నారు.

విజయవాడలో పోలవరం కాంట్రాక్టర్లు 10కోట్ల రూపాయలతో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టారని, ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ అందులో ఉంటున్నారని సెలవిచ్చారు. 

ఇక వైసీపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. 30లక్షల మందికి ఇళ్లపట్టాల కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ భూమిని.. చివరకు ప్రభుత్వమే కొంటోందని, వైసీపీ నేతలు ఈ పథకం ద్వారా బాగా లాభపడ్డారని విమర్శించారు.

అమ్మా పెట్టా పెట్టదు.. అన్నట్టుంది వీర్రాజు వాలకం. వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చేతకాదు, ఇంకొకరు ఇస్తున్నారంటే కడుపు మంట. ఇలా ఉంది వీర్రాజు వ్యవహారం. ఇక అపార్ట్ మెంట్లు కట్టారు, అవినీతి చేశారంటున్నారు కానీ, వారి పేర్లు మాత్రం ఎందుకో ఆయన బైటపెట్టలేదు. 

ఒకవేళ ఆ అవినీతి చిట్టా అంతా కేంద్రానికి సమర్పించి ఆయనే విచారణ మొదలు పెట్టించొచ్చు కదా. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కదా. ఒకవేళ అందర్నీ మేనేజ్ చేసే చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా? ఏమో.. వీర్రాజుకే ఎరుక.

ఈనాడు-నిమ్మగడ్డ-చంద్రబాబు.. ఓ గూడు పుఠానీ