చిరంజీవి సోద‌రుడు ధృవ్ దంప‌తుల‌కు క‌రోనా

బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నెమ్మ‌దిగా  ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కూడా పంజా విసురుతోంది. తాజాగా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా త‌న రుచి చూపింది. ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి స‌ర్జా సోద‌రుడు ధృవ్ స‌ర్జా,…

బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నెమ్మ‌దిగా  ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కూడా పంజా విసురుతోంది. తాజాగా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా త‌న రుచి చూపింది. ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి స‌ర్జా సోద‌రుడు ధృవ్ స‌ర్జా, ఆయ‌న భార్య ప్రేర‌ణ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ధృవ్ స్వ‌యంగా ట్విట‌ర్‌లో ప్ర‌క‌టించాడు. అయితే ధృవ్ అభిమానులు అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిసింది.

ధృవ్ దంప‌తులిద్ద‌రికీ స్వ‌ల్ప క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్టు వైద్య ప‌రీక్షల్లో వెల్ల‌డైంది. ఈ విష‌యాన్నే ఆయ‌న తెలిపాడు. ప్ర‌స్తుతం దంప‌తులిద్ద‌రూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తాము క్షేమంగా తిరిగి వ‌స్తామ‌ని అభిమానుల‌కు ధైర్యం చెప్పాడు. త‌న‌తో ఇటీవ‌ల స‌న్నిహితంగా మెలిగిన ప్ర‌తి ఒక్క‌రూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరాడు.

గ‌త నెల‌లో ధృవ్ అన్న‌ చిరంజీవి స‌ర్జా గుండె పోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. చిరంజీవి కుటుంబం ఆ బాధ నుంచి తేరుకోకుండానే ఆ కుటుంబంలో భార్యాభ‌ర్త‌లు క‌రోనా బారిన ప‌డ‌డం స‌హ‌జంగానే ఆందోళ‌న క‌లిగిస్తోంది.  

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక