‘ఊ.. అంటావా’ సాంగ్ వెనక గమ్మత్తైన విషయం

'ఊ.. అంటావా మామా.. ఉఊ అంటావా మా..' తెలుగు రాష్ట్రాల్నే కాదు, దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపిన ఐటెంసాంగ్ ఇది. దేవిశ్రీ ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ…

'ఊ.. అంటావా మామా.. ఉఊ అంటావా మా..' తెలుగు రాష్ట్రాల్నే కాదు, దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపిన ఐటెంసాంగ్ ఇది. దేవిశ్రీ ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ పాట అతడ్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ సాంగ్ కంపోజిషన్ వెనక గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టాడు దేవిశ్రీ.

'ఊ.. అంటావా' సాంగ్ ను మేకర్స్ రిజక్ట్ చేస్తారని దేవిశ్రీ భావించాడట. ఎలాగూ తిరస్కరిస్తారనే నమ్మకంతో సాంగ్ ను కంపోజ్ చేశాడట. ఆ పాటను అలా కంపోజ్ చేయడం వెనక తన ఆలోచనను, మేకర్స్ ఆ టైమ్ లో ఫీల్ అయిన మూమెంట్ ను గుర్తుచేసుకున్నాడు ఈ జాతీయ అవార్డ్ గ్రహీత. 

“ప్రతి ఒక్కరు నా నుంచి ఓ మసాలా ఐటెంసాంగ్ ఆశించారు. కానీ నా ఆలోచన మరోలా సాగింది. ఓ ఐటెంసాంగ్ తో జనాల్ని ఎందుకు మైమరిపించకూడదు అనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఊ అంటావా సాంగ్. ఆ సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. కచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేస్తారని ఫిక్స్ అయిపోయాను. సాంగ్ పంపించి, కింద ఓ చిన్న నోట్ కూడా రాశాను. మీరు ఆశించిన దానికి భిన్నంగా నేను వేరే ట్యూన్ పంపిస్తున్నాను. నాకు పిచ్చి పట్టిందని మీరు అనుకోవచ్చు. ఈ పాటను మీరు తిరస్కరించొచ్చు కూడా. కానీ దయచేసి నన్ను నమ్మండి, ఈ పాటను సినిమాలో పెట్టండి, ఇది ఐటెంసాంగ్స్ ను రీ-డిఫైన్ చేస్తుంది, అంటూ నోట్ పంపించాను.”

దేవిశ్రీ ఊహించినట్టుగానే పాట ప్రారంభంలో వినగానే, ఇదేంటి ఇంత స్లోగా ఉందని ఫీల్ అయ్యారట సుకుమార్, అల్లు అర్జున్. మొదటి 30 సెకెన్లు సాంగ్ చాలా స్లోగా ఉందని, ఆ తర్వాత మాత్రం ఊపందుకుందని చెప్పారట. ఇక అక్కడ్నుంచి డాన్స్ చేయకుండా ఆగలేకపోయామని చెప్పారట. 

అలా తను రిజెక్ట్ అవుతుందనుకున్న పాట, మేకర్స్ కు నచ్చడంతో పాటు, దేశాన్ని ఓ ఊపు ఊపిందని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ. 'ఊ.. అంటావా' సాంగ్ తనకు దేశవ్యాప్తంగా మరోసారి క్రేజ్ తీసుకొస్తే, శ్రీవల్లి సాంగ్ తనకు పెద్దోళ్ల నుంచి ప్రశంసలు తెచ్చిపెట్టిందని అన్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.