cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

దుల్కర్..ఏమిటా క్రేజ్

దుల్కర్..ఏమిటా క్రేజ్

సినిమా జనాలు ఎవ్వరు ఆంధ్రలోకి వెళ్లినా జనం బ్రహ్మరధం పట్టడం కామన్. కానీ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కోసం ఎగబడి మరీ వస్తున్న యూత్ ను చూస్తుంటే కాస్త ఆశ్చర్యంగానే వుంది. దుల్కర్ మహానటి సినిమా ద్వారా, కొన్ని మలయాళ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు పరిచయమే. కానీ మరీ ఇంత అభిమానం వుందని ఇప్పుడే క్లారిటీ వచ్చింది. తెలుగు టాప్ హీరోలకు మన దగ్గర ఏ రేంజ్ ఆదరణ వుందో అది కనిపిస్తోంది.

చూస్తుంటే దుల్కర్ కు తెలుగునాట మాంచి క్రేజ్ వున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈవారం విడుదల కాబోతున్న సీతారామ్ సినిమా క్లాస్ సినిమా. మాస్ కాదు. కానీ దుల్కర్ కోసం ఎగబడుతున్న కుర్రకారు, ఆ సినిమాలో పాటలను పాడేస్తున్న అమ్మాయిలను చూస్తుంటే క్రేజ్ మామూలుగా లేదనిపిస్తోంది.

మహానటి, సీతారామ్ సినిమాలు రెండూ ఒకటే బ్యానర్. మరే తెలుగు బ్యానర్ దుల్కర్ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు ఈ క్రేజ్ చూస్తే కచ్చితంగా తెలుగు నిర్మాతలు దుల్కర్ వెనుక పడే అవకాశం వుంది. కానీ దుల్కర్ తో రెగ్యులర్ ఫార్మాట్ సినిమా పనికి రాదు. అలా అని మరీ క్లాస్ కూడదు. 

ఫన్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ కలిసి యూత్ ఫుల్ పిల్మ్ కావాల్సి వుంటుంది. అలాంటి సినిమాలు తీసే సత్తా వున్న యంగ్ డైరక్టర్లు తెలుగులో వున్నారు కానీ వారి చూపు అంతా మన హీరోల మీద, ఫార్మాట్ సినిమాల మీద వుంది. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి