బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్?

మెల్లగా సీనియర్ హీరోలంతా మల్టీస్టారర్స్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్ లాంటి హీరోలు ఈ తరహా ప్రయోగాలు చేశారు. వెంకటేష్ చాన్నాళ్లుగా మల్టీస్టారర్లలో నటిస్తుంటే.. చిరంజీవి, రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య…

మెల్లగా సీనియర్ హీరోలంతా మల్టీస్టారర్స్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్ లాంటి హీరోలు ఈ తరహా ప్రయోగాలు చేశారు. వెంకటేష్ చాన్నాళ్లుగా మల్టీస్టారర్లలో నటిస్తుంటే.. చిరంజీవి, రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య రూపంలో హిట్ కొట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలయ్య కూడా చేరేలా ఉన్నారు.

ఇన్నాళ్లూ సోలోగానే పెర్ఫార్మ్ చేస్తూ వచ్చారు బాలకృష్ణ. మల్టీస్టారర్ సబ్జెక్టుల్లో కూడా తనే ద్విపాత్రాభినయం చేస్తూ నెట్టుకొచ్చారు. అయితే బాబి మాత్రం బాలకృష్ణతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బాలయ్యతో చేయబోయే సినిమా కోసం దుల్కర్ సల్మాన్ తో చర్చలు జరుపుతున్నాడట ఈ దర్శకుడు.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి-రవితేజ కాంబినేషన్ ను చూపించిన బాబి, తన కొత్త సినిమాలో బాలకృష్ణ-దుల్కర్ ను చూపించాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అటు దుల్కర్ కు ఇలాంటి మల్టీస్టారర్లు అస్సలు కొత్త కాదు. కమల్ హాసన్-మణిరత్నం సినిమాలో కూడా దుల్కర్ ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

బాలయ్య-బాబి సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. షూటింగ్ మొదలైందని తెలుపుతూ ఈమధ్య వినూత్నమైన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.