Advertisement

Advertisement


Home > Movies - Movie News

దుల్కర్ కు అఖిల్ హలీమ్

దుల్కర్ కు అఖిల్ హలీమ్

మలయాళ హీరో, తెలుగు వారి లేటెస్ట్ క్రేజ్ అయిన దుల్కర్ సల్మాన్ కు ఫుడ్ అంటే మహా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా అక్కడ లోకల్ ఫేమస్ ఏమిటి అని అడిగి తెలుసుకుంటాడట. 

ఇటీవల విజయవాడ వెళ్లినపుడు అక్కడ ఏమిటి ఫేమస్ అని అడిగి ఉలవచారు బిరియానీ లాగించేసాడు. అక్కడే బాబాయ్ ఇడ్లీ కూడా ఫేమస్ అని తెలిసి ట్రయ్ చేద్దాం అనుకున్నాడట. కానీ వీలు కుదరలేదట.

హైదరాబాద్ లో హలీమ్ అంటే పిచ్చ ఇష్టమంట. హీరో అఖిల్ రంజాన్ టైమ్ లో ప్రత్యేకంగా హలీమ్ ను దుల్కర్ కోసం పంపిస్తాడట. ఇండియాలో ఎక్కడ వున్నా, విదేశాల్లో వున్నా కూడా అఖిల్ నుంచి హలీమ్ అందుతుందట. భలే ప్యాక్ చేసి పంపిస్తాడు అఖిల్ అంటున్నాడు దుల్కర్.

ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడకు వెళ్లినా లోకల్ ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రం పక్కా అంటున్నాడు. హైదరాబాద్ లో వున్నన్నాళ్లు అశ్వనీదత్, స్వప్నదత్ ఆతిధ్యం ఓ రేంజ్ లో వుంటుందన్నాడు. స్వప్నదత్ ఆతిధ్యం, అశ్వనీదత్ సెట్ లో చేసే మర్యాదలు మరిచిపోలేనంటున్నాడు దుల్కర్.

సీతారామం సినిమా ప్రమోషన్ టూర్ కోసం ఏకంగా చార్టర్ ఫ్లయిట్ నే ఏర్పాటు చేసారు నిర్మాతలు. మరి ఆ రేంజ్ మర్యాదలు చేస్తే ఎలా మర్చిపోతాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?