బండ్ల గ‌ణేశ్ మాట‌ల దుమారం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్ది స‌భ్యుల నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ మ‌ద్ద‌తుదారుడైన నిర్మాత‌, క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేశ్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్ది స‌భ్యుల నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ మ‌ద్ద‌తుదారుడైన నిర్మాత‌, క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేశ్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ‘మా’ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ఎజెండా ఆ సంస్థ‌కు భ‌వ‌న నిర్మాణం ఎజెండా అయిన సంగ‌తి తెలిసిందే. అలాంటి ప్రాధాన్య అంశంపై బండ్ల గ‌ణేశ్ తాజా వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బండ్ల చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి తెలుసుకుందాం.

‘ప్రకాశ్‌రాజ్‌ ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. ‘మా’లో కూడా ఆయన ఎన్నో అభివృద్ధి ప‌నులు చేయాలనుకుంటున్నాడు. చేస్తాడ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. అందుకే ఆయనకు నా మద్దతు ప్రకటించాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్‌కు వ్యతిరేకిని. ఇప్పుడు అది కట్టాల్సిన అవసరం లేదు’ అని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌త్య‌ర్థుల‌కు బండ్ల గ‌ణేశ్‌ మాట‌లు ఓ ఆయుధం ఇచ్చిన‌ట్టైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే భ‌వ‌నం వ‌ద్ద‌నడానికి ఆయ‌న చెబుతున్న కార‌ణాలు ఏంటంటే….

‘అసోసియేషన్‌లో సుమారు 900 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 150 మంది వరకూ దారిద్ర్య‌రేఖకు కింద ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. బిల్డింగ్ క‌ట్టేందుకు ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్కే వేరు. ‘మా’కి బిల్డింగ్‌ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్‌ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’ అని బండ్ల గణేశ్ త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. దీనిపై ప్ర‌త్య‌ర్థులు ఏమంటారో చూడాలి మ‌రి!