తెలంగాణలో ఇప్పుడు హాట్ డిస్కషన్ ఒక్కటే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దాడులు, ప్రశ్నించడాలు, విచారణలు. ఇప్పటకే పూరి జగన్నాధ్, విజయ్ దేవర కొండ, ఫైనాన్షియర్ శొభన్ తదితరులను పిలిచి విచారించారు. అయితే ఇదంతా కేవలం లైగర్ సినిమా లావాదేవీలకు సంబంధించి మాత్రమే. కానీ ఇవి కాకుండా మరి కొన్ని లావాదేవీల మీద కూడా ఈడీ కన్ను వేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో పొలిటికల్ మనీ మీద పెట్టుబడుల మీద కన్ను వేసి వుంచారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ బడా దర్శకుడిని తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుల బినామీగా అనుమానిస్తున్నారని, అతని ద్వారానే టాలీవుడ్ లోకి పెట్టుబడులు వెళ్తున్నాయని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడితో లింక్ వున్న సంస్థలు, ఆ సంస్థలతో లింక్ వున్న నిర్మాతలు అందరిపై దృష్టి పెట్టారని టాక్. అలాగే ఆంధ్ర నుంచి కొద్ది మంది రాజకీయ నాయకులు, మైనింగ్ వ్యాపారులు పెట్టుబడులు వున్నాయని ఓ బడా నిర్మాణ సంస్థ మీద దృష్టి పెట్టారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఆంధ్రకు చెందిన ఓ బడా రాజకీయ నాయకుడు కమ్ మైనింగ్ వ్యాపారి, తెలంగాణ కు చెందిన ఓ మంత్రి పెట్టుబడులు పెట్టారని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థపై కన్నేసి వుంచారని అంటున్నారు. వాస్తవానికి టాలీవుడ్ లో ఇప్పుడు బ్లాక్ మనీ అన్నది తొంభై శాతం తగ్గిపోయింది. జీఎస్టీ వచ్చిన తరువాత నిర్మాతే జీఎస్టీ కట్టుకుంటునేలా ఒప్పందం కుదుర్చుకుని అందరూ వైట్ నే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే వైట్ అమౌంట్ దొరకడం కూడా కష్టంగానే వుంది.
తెలంగాణ, ఆంధ్ర రాజకీయ నాయకుల పెట్టుబడులు సినిమా రంగంలో వుండడం అన్నది చిరకాలంగా వినిపిస్తున్న మాటే. కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర సంస్థలు నిఘా గట్టిగా పెట్టాయి. ఎందుకంటే ఎన్నికల ముందే ఈ అమౌంట్లు మళ్లీ టాలీవుడ్ నుంచి వెనక్కు వెళ్తాయి. ఎన్నికల్లో మనీ చలామణీ ఆగాలంటే ఇక్కడ బ్రేక్ వేయాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద టాలీవుడ్ ఇప్పుడు ఈడీ స్కాన్ లో వుందనే బలంగా వినిపిస్తోంది.