ఈ సినిమాలు అన్నీ 2024 లోనేనా!

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామినెంట్ మూవీస్ కొన్ని వున్నాయి. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు అవి. కానీ వీటిలో చాలా సినిమాలు 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కారణం…

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామినెంట్ మూవీస్ కొన్ని వున్నాయి. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు అవి. కానీ వీటిలో చాలా సినిమాలు 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కారణం మరేమీ కాదు. ఇవన్నీ హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావడమే. మేకంగ్ కు చాలా టైమ్ పట్టడంతో పాటు విడుదలకు సరైన సీజన్ కూడా అవసరం.

ప్రభాస్ ప్రాజెక్ట్ కే మీద చాలా అంచనాలు వున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ మీద వున్న నమ్మకం అది. కానీ ఈ సినిమా 2024 వరకు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ రెండు భాగాలు వున్నాయి. అవన్నీ విడుదల కావాలి. అప్పుడే ప్రాజెక్ట్ కే. ఆ తరువాతే పీపుల్స్ మీడియా నిర్మించే ప్రభాస్ సినిమా విడుదల. ప్రాజెక్ట్ కె విడుదలయ్యే వరకు ఈ సినిమా విడుదలకు నిర్మాత అశ్వనీదత్ అంగీకరించరు అని టాక్.

బన్నీ-సుకుమార్ పుష్ప 2 మీద భారీ భారీ అంచనాలు వున్నాయి. ఆ సినిమా ఇప్పుడే ప్రారంభమైంది. ఎలా లేదన్నా కనీసం పది నెలలు ప్రొడక్షన్ కు అవసరం కావచ్చు. ఇలాంటి సినిమా విడుదల కావాలి అంటే అయితే సంక్రాంతికి కాస్త అటు ఇటు..లేదంటే సమ్మర్. అంటే 2023 డిసెంబర్ కు రెడీ అయితే ఓకె. లేదూ అంటే మాత్రం 2024నే. పుష్ప వన్ టైమ్ లో బన్నీ స్వయంగా పూనుకుని సినిమాను స్పీడ్ గా రెడీ చేయించారు. ఈసారి కూడా అలా చేస్తే ఓకె లేదంటే 2024 నే.

రామ్ చరణ్ -శంకర్ సినిమా వుంది. రెండు వందల కోట్లకు పైగా ఖర్చుతో కూడిన సినిమా. ఈ సినిమా 2023 సమ్మర్ కు అని ముందు వినిపించింది. కానీ ఆ వేళకు రెడీ కావడం కష్టం అని ఇప్పుడు వినిపిస్తోంది. సమ్మర్ మిస్ అయితే ఆ సినిమాకు కూడా సంక్రాంతినే కావాలి. పైగా 2023 సమ్మర్ తరువాత రాబోయే పెద్ద సినిమాలు కొన్ని వున్నాయి. అందువల్ల 2023 సమ్మర్ కనుక మిస్ అయితే రామ్ చరణ్ సినిమా కూడా 2024 కు వెళ్లిపోయే అవకాశం వుంది.

ఎన్టీఆర్-కొరటాల సినిమా మీద ఎదురుచూపులు చాలా వున్నాయి. కానీ ఫిబ్రవరి-మార్చికి కానీ ప్రారంభం కాదని వార్తలు వుండనే వున్నాయి. దీనికీ అదే సమస్య. పాన్ ఇండియా…వందల కోట్ల బడ్జెట్. అందువల్ల మేకింగ్ కు సమయం పడుతుంది. డేట్ కూడా దొరకాలి. 2023లో అలాంటి డేట్ ఈ సినిమాకు దొరకుతుందా? అన్నది అనుమానం. ఇక మిగిలింది 2024 నే.

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మాంచి మాస్ సినిమా అవుతుందని ఆశ. కానీ ఈ సినిమా కూడా 2024 కే అనుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది హరిహర వీరమల్లు విడుదల వుంటుంది. మరో సినిమా వినోదయసితం వుండొచ్చు. రెండు సినిమాల కన్నా ఒకే ఏడాది పవన్ లాంటి పెద్ద హీరో నుంచి ఆశించడం కష్టం.

మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు ఏ సమస్యా లేదు. ఆగస్టులో విడుదలకు రెడీ అయిపోతుంది. అలాగే సీనియర్ హీరోలకు ఏ సమస్యాలేదు. బాలయ్య, చిరు, నాగ్, రవితేజ ల సినిమాలు వస్తూనే వుంటాయి. అలాగే యంగ్ హీరోలకు సమస్య లేదు చైతూ, అఖిల్, శర్వా, నాని, ఇలా అందరికీ ఈ ఏడాది సినిమాలు వుంటాయి. పెద్ద సినిమాలకే సమస్య.