బాలయ్య సినిమా అంటే ఫైట్లు వుండాల్సిందే. నరకాల్సిందే. రక్తాలు కారాల్సిందే. ఎప్పుడో వచ్చిన సమరసింహారెడ్డి నుంచి నిన్న మొన్నటి జైసింహా వరకు అదే వ్యవహారం.
లేటెస్ట్ గా విడుదల అవుతున్న రూలర్ సినిమా కూడా ఇందుకు అతీతం ఏమీ కాదట. బోయపాటి సినిమాలు గుర్తుకు వచ్చే రేంజ్ లో ఫైట్లు చొప్పించారట ఈ సినిమాలో.
ఓ ఫైట్ ఏకంగా ఎనిమిది నిమషాల పాటు కొన'సాగు'తుందని బోగట్టా. ఈ ఫైట్ నిరాటంకంగా ఎనిమిది నిమషాల పాటు కొనసాగితే ఆడియన్స్ ఏమేరకు ఆస్వాదిస్తారన్నది చూడాలి. ఇదే కాదు, సినిమాలో మరో రెండు ఫైట్లు కూడా ఈ మేరకు నిడివితోనే వుంటాయని తెలుస్తోంది.
ఈ రోజు సెన్సారు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కొన్ని కట్స్, కొన్ని మ్యూట్స్ చెప్పారు. కానీ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదు. రేపు ఇస్తారు. సిజి వర్క్ లు బాగానే వున్నాయని, బాలయ్య కు విగ్ లు బాగానే సెట్ అయ్యాయని సెన్సారు తరువాత వినిపిస్తున్న మాట.