నందమూరి బాలకృష్ణ సినిమాలు రెండు లైన్ లో వున్నాయి. మైత్రీ మూవీస్ సినిమా ఒకటి, అనిల్ రావిపూడి సినిమా మరోటి. ఇవి ఇలా వుండగానే మరి కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాకుండా అసలు మాస్టర్ ప్లాన్ వేరే వుందట.
ఎన్నికలు వస్తున్నాయి అని తెలియగానే చేస్తున్న సినిమాలు అన్నీ పక్కన పెట్టేయాలని బాలయ్య డిసైడ్ అయ్యారట. ఎన్నికల వాతావరణం ఏర్పడగానే బోయపాటి శ్రీను తో సినిమా అన్నది పక్కాగా బాలయ్య ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
మాంచి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఆ సినిమా వుంటుందట. నేరుగా ప్రభుత్వంపై సెటైర్లు, విమర్శలు గట్టిగా వుండేలా స్క్రిప్ట్ ను బోయపాటి తయారుచేసి పెట్టుకోవాలని ఇప్పటికే బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.
దీనికి నిర్మాత ఎవరు…ఏమిటి అన్నది తరువాత. ముందు ఎన్నికల సమయంలో బోయపాటితో బాలయ్య సినిమా ఫిక్స్ అన్నదే వార్త. బోయపాటి పక్కా తెలుగుదేశం వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
గతంలో గోదావరి పుష్కారాల సమయంలో చంద్రబాబు మీద ఆయన షూటింగ్ చేయడం, ఆ గందరగోళం అంతా గుర్తున్నదే.