మన్మథుడు-2.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి.
ఈ సినిమా తర్వాత, ఈ సినిమాకు ముందు కూడా రకుల్ కు ఎలాంటి హిట్స్ లేవు. కనీసం యావరేజ్ అని చెప్పుకునే మూవీ కూడా లేదు. ఆమెకు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి మేకర్స్, హీరోలు భయపడుతున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తన కోసం పడిచస్తున్నారనే రేంజ్ లో బిల్డప్ ఇస్తోంది రకుల్. టాలీవుడ్ ప్రేక్షకులు తనను ప్రేమిస్తున్నారని, వాళ్ల కోసమైనా తెలుగులో సినిమాలు చేస్తానని చెబుతోంది.
“సౌత్ ప్రేక్షకులు నన్ను చాలా ప్రేమిస్తారు. నా నుంచి చాలా సినిమాలు ఆశిస్తున్నారని నాకు తెలుసు. అందుకే నేను టాలీవుడ్ ను విడిచిపెట్టను. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తాను. టాలీవుడ్ నాకు పేరు తెచ్చిపెట్టింది. కాబట్టి కచ్చితంగా తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.”
చూశారుగా.. రకుల్ సమాధానం ఇది. టాలీవుడ్ నుంచి తనకు వెల్లువలా అవకాశాలు వస్తున్నాయని, తను మాత్రం వేరే భాషలో బిజీ అవ్వడం వల్ల తెలుగులో సినిమాలు చేయలేకపోతున్నానని కలరింగ్ ఇచ్చింది రకుల్. తన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఓపిగ్గా ఎదురుచూడాలంటోంది.
“ప్రస్తుతం హిందీ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను. కొత్త కొత్త కథలు వస్తున్నాయి. నేను తెలుగు ప్రేక్షకులకు ఒకటే చెబుతున్నాను. సహనంతో ఉండండి, నా హిందీ సినిమాలు కూడా చూడండి. తెలుగులో తప్పకుండా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.”
టాలీవుడ్ లో రకుల్ పనైపోయింది. ఆమెకిప్పుడు అవకాశాలు అంతంతమాత్రంగా కూడా రావడం లేదు. పైగా రకుల్ ను మరిచిపోవడం ప్రేక్షకులకు పెద్ద పనేంకాదు. కానీ రకుల్ మాత్రం టాలీవుడ్ పై ఇంకా చాలా ఆశలు వదిలినట్టు లేదు.