చింతకాయల రవి..గోపి గోపిక గోదావరి..దమ్ము..రామాచారి లాంటి వరుస ఫ్లాపుల తరువాత కనుమరుగైపోయాడు హీరో వేణు తొట్టెంపూడి. ఆ మాటకు వస్తే 2006 తరువాత నుంచి సరైన సినిమా పడలేదు.
ఇక సినిమాలు మానేసాడు అనుకున్నారంతా. ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చేసాయి. రవితేజ ఎమ్మార్వోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ పాత్రకు వేణు తొట్టెంపూడిని తీసుకున్నారట. మరి ఎక్కడ లింక్ కలిసిందో? ఎలా సెట్ అయిందో కానీ మళ్లీ తెరమీద కనిపించబోతున్నాడు వేణు.
నిజానికి తెలుగులో ఇప్పుడు సరైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల అవసరం చాలా వుంది. కాస్త సీనియర్ అయితే చాలు రోజుకు లక్షలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో హీరోలుగా దుకాణం సర్దేసిన వాళ్లు ఇలా సెటిల్ అయితే టాలీవుడ్ లో కెరీర్ కొనసాగుతుంది. జనాల కళ్ల ముందు కొన్నాళ్లు కనిపించే అవకాశం వుంటుంది.