కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర. అలాంటి హీరోకి మళ్లీ లుక్ టెస్ట్ ఏమిటి? కానీ చేసారు. రామ్ పోతినేని-మైత్రీ సంస్థ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఓ సినిమా హీరో పాత్ర వుంది.
సినిమాలో హీరో రామ్ ఓ సినిమా హీరో అభిమానిగా కనిపిస్తాడు. రామ్ లాంటి పాపులర్ హీరో సినిమాలో మరో హీరో అభిమానిగా కనిపించాలి అంటే దానికి సరైన నటుడు కావాలి.
మైత్రీ సంస్ధ ఈ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా అని చాలా ఎక్సర్ సైజ్ చేసింది. బాలకృష్ణ దగ్గర నుంచి మోహన్ లాల్ వరకు చాలా పేర్లు వినిపించాయి.
ఆఖరికి కన్నడ స్టార్ ఉపేంద్రను ఫైనల్ చేసుకున్నారు. అయితే ఈ లుక్ డిఫరెంట్ గా వుండాలని డిసైడ్ అయ్యారు. అందుకే లుక్ టెస్ట్ చేసారు. ఓ లుక్ ను ఫైనల్ చేసారు. ఇంక ఉపేంద్ర పార్ట్ షూట్ చేయాల్సి వుంది.
ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే పేరు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే సినిమాలో ఉపేంధ్ర బిరుదు ఆంధ్ర కింగ్ అన్న మాట. హీరో రామ్ ఆయన తాలూకా.
ఇటీవల పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నది బాగా పాపులర్ అయింది. అందువల్ల ఇప్పుడు ఈ టైటిల్ బాగా క్యాచీగా అనిపిస్తోంది.
ఫస్ట్ ఈయన గారిని పెళ్లి తాలూకా అవ్వమను