ఇద్దరు మిత్రులను ఒక సీటు విడదీసింది అంటే ఆశ్చర్యం అసలు ఉండదు. ఇది పక్కా రాజకీయం. అందువల్ల ఎవరైనా తమ సొంత ప్రయోజనాలే చూసుకుంటారు. 2009లో భీమిలీ నుంచి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి గెలిచిన అవంతి శ్రీనివాసరావుకు అది సొంత సీటు. 2014లో టీడీపీలో అవంతి చేరిన తరువాత భీమిలీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు.
అయితే 2019లో ఆ సీటు నుంచి అవంతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందుకే ఆయన అనకాపల్లి నుంచి 2014లో ఎంపీగా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చారు. తీరా 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గంటా అదే సీటు నుంచి మళ్ళీ పోటీ అన్నారని టాక్. దాంతో అవంతి వైసీపీలోకి జంప్ చేసి భీమిలీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావడమే కాదు మంత్రి కూడా అయ్యారు.
వైసీపీ 2024లో ఓడిపోయేంతవరకూ ఆ పార్టీలో ఉన్న అవంతి గత ఏడాది చివరిలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఆనాటి నుంచి టీడీపీ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. జీవీఎంసీలో కూటమికి కార్పోరేటర్ అయిన తన కుమార్తె ద్వారా ఓటు వేయించి నెగ్గించిన అవంతికి ఇపుడు పసుపు శిబిరంలోకి ఆహ్వానం లభిస్తోంది అంటున్నారు.
త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకుంటారు అని అంటున్నారు. ఇది ఒకనాటి దోస్త్ గంటాకు ఇష్టం ఉన్నా లేకపోయినా హైకమాండ్ డెసిషన్ అని అంటున్నారు. దాంతో గంటా కోటలో అవంతి పాగా వేస్తున్నారు అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి భీమిలీ నుంచే టీడీపీ తరఫున పోటీ చేయడం కోసమే అవంతి టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు.
గంటా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక కుమారుడికి భీమిలీ సీటు అడుగుతారా లేక వేరే చోటు చూసుకుంటారా అన్నది ప్రస్తుతానికి అయితే తెలియదు. అవంతి మాత్రం తన పదిహేనేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారి అయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు అని అంటున్నారు.
Avantika raajakeeya samadhe ikan.
వాళ్ళు వాళ్ళు ఏదో ఏడుస్తారులే గాని..
మన జగన్ రెడ్డి పార్టీ కి భీమిలి లో అభ్యర్థి కూడా లేడు .. అది చూసుకోండి..
..
175 నియోజకవర్గాల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో వైసీపీ కి అభ్యర్థులే లేరు..
ఈ బోకుగాడు మళ్ళీ అధికారం లోకి వచ్చేస్తామని కలలు కంటున్నాడు..
ఆ బోకుగాడికి మీ చిడతల భజన అదనం..
ఇవన్నీ రాజకీయాలలో సహజం.. ఒక్క అరగంట లో పరిస్థితు లు మారిపోతాయి