ఆప‌రేష‌న్ సింధూర్‌… మ‌తోన్మాదంపై విజ‌యం

మేము భార‌తీయులం. మా అమాయ‌క ప్ర‌జ‌ల్ని పొట్ట‌న పొట్టుకున్న టెర్ర‌రిస్టుల‌ను, వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న పాకిస్థాన్‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సిందే

ప‌హ‌ల్గాంలో ప‌ర్యాట‌కుల ఉసురు తీసిన ఉగ్ర‌వాదుల అంతు చూసేందుకు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగించింది. కేవ‌లం ఉగ్ర‌వాదులను తుద ముట్టించ‌డ‌మే కాకుండా మ‌న‌దేశంలో మ‌తోన్మాదుల‌పై విజ‌యం కూడా సాధించ‌డం విశేషం.

పాకిస్థాన్‌పై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌ను అడ్డు పెట్టుకుని కొంద‌రు మ‌తోన్మాదులు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని పొందాల‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. పాకిస్థాప్‌పై ప్రేమ వుంటే, ఆ దేశానికి వెళ్లిపోవాలంటూ సొంత దేశ‌వాసులపై అవాకులుచెవాకులు పేలిన నాయ‌కుల మాట‌లు కొంద‌రి మ‌నోభావాల్ని దెబ్బ‌తీశాయి. కానీ కుల‌మ‌తాలేవైనా మ‌న‌మంతా భార‌తీయులం, ఈ గ‌డ్డ‌పై పుట్ట‌డంపై త‌మ అదృష్టంగా భావించారు.

ఆప‌రేష‌న్ సింధూర్‌కు మ‌ద్ద‌తుగా, అలాగే త్రివిధ ద‌ళాల‌కు నైతిక మ‌ద్ద‌తుగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియ‌న్లు, సిక్కులు అనే తేడా లేకుండా ప్ర‌తి భారతీయుడు జాతీయ జెండా చేప‌ట్టి, సంఘీభావ ర్యాలీలు నిర్వ‌హించారు. యుద్ధాన్ని ఆస‌రాగా చేసుకుని, నువ్వు ఫ‌లానా మ‌త‌మైతే పాకిస్థానీయుడివే అనే ముద్ర వేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లం కాలేదు.

“మేము భార‌తీయులం. మా అమాయ‌క ప్ర‌జ‌ల్ని పొట్ట‌న పొట్టుకున్న టెర్ర‌రిస్టుల‌ను, వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న పాకిస్థాన్‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సిందే” అని దేశ‌మంతా ముక్త కంఠంతో నిన‌దించింది.

అందుకే ఆప‌రేష‌న్ సింధూర్ విష‌యంలో మ‌న దేశ ప్ర‌జానీకంలో మాన‌వ‌త్వం త‌ప్ప‌, మ‌తం క‌నిపించ‌లేదు. ప‌హ‌ల్గాంలో ప‌ర్యాట‌కుల్ని మ‌తం అడిగి మ‌రీ కాల్చి వేయ‌డం గురించి మీడియాలో అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇదే సంద‌ర్భంలో కొన్ని మ‌తాల వాళ్ల‌ను పాకిస్థాన్ మ‌ద్ద‌తుదారులుగా చిత్రీక‌రించి, దేశ ప్రజానీకం మ‌ధ్య మ‌త‌చిచ్చు పెట్టాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నించ‌డం చూశాం.

కానీ మ‌తం కంటే మాన‌వ‌త్వం, దేశ‌భ‌క్తి మిన్న అని చాటిన మ‌న సంస్కృతి గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వందేమాత‌రం, జై భార‌త్‌, దేశ ఐక్య‌త వ‌ర్ధిల్లాలి అనే నినాదాలు త‌ప్ప‌, మ‌రే మాట వినిపించ‌లేదు. ఇదీ భార‌తీయ సంస్కృతి, మాన‌వీయ‌త అని మ‌రోసారి ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌పంచానికి స‌గ‌ర్వంగా చాటి చెప్పింది.

11 Replies to “ఆప‌రేష‌న్ సింధూర్‌… మ‌తోన్మాదంపై విజ‌యం”

  1. ఇలానే అనుకుంట ఉండండి అమాయకంగా.

     అక్కడ ఖలీఫత్ కోసం ప్రపంచం వ్యాప్తంగా జీహాద్ చేస్తున్న ఎడారి ముసలోడు మతం వాళ్ళు కి మన లో వాళ్ళే , మీతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ, 

    తెర వెనుక పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేస్తూ, ఇండియ లో ఇస్లాం రాజ్యం రావాలి అని ట్రై చేస్తున్న స్లీపర్ సెల్చేస్ మాత్రం ఆపరు.  

    ప్రపంచం లో అన్ని చోట్ల జరుగుతున్న కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. 

    మనం మాత్రం కళ్ళు మూసుకుని అబ్బే అలా జరగడం లేదు అనుకుంటే, మీది అరముక్క చేసి, మీ ఇంట్లో వాళ్ళకి హిజాబ్ వేసే రోజు ఎంతో పట్టదు.

    1. ధనిక క్రిస్తవ దేశాలు లే ఇప్పుడు గోలు గోలు మంటున్నాయి, ఇస్లాం దెబ్బకి.

      అమెరికా

      UK 

      జర్మనీ 

      ఆస్ట్రియా

      ఆస్ట్రేలియా 

      .

      మరి మనం ఇంకా అదే భ్రమ లో ఉందామా ! 

      కనీసం క్రైస్తవులకు ఒక దేశం పోయిన, ఇంకో దేశం వింది.

      మీ హిందువులకి కేవలం భారత దేశం మాత్రమే.

      కేవలం హిందువు గా ఉన్నత కాలం మాత్రం ఇండియా మీకు పూజనీయ దేశం. ఒక్కసారి మతం మారార, ఇది మీకు కేవలం ఒక మట్టి గుట్ట మాత్రమే మీ పూజ చేసే స్థలాలు దేశం బయట ఉంటాయి. అందుకే, ఇండియ హిందువుల మెజారిగ్ గా వున్న కాలం మాత్రం మే సేఫ్ గా ఉంది.

      1. యుకె, జర్మనీ లో అక్కడ క్రైస్తవ అమ్మాయిలని రేప్ చేయడానిక్ ముస్మిం కుర్రాళ్లతో గ్రేమింగ్ గ్యాంగ్ అని ప్రెగ్నెసీ జీహాద్ చేస్తున్నారు.

  2. వాళ్ళు సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు, మాకు ఇస్లాం రాజ్యం కావాలి.

    మేము మెజారిటీ గా మారే దాకా, మీ ప్రభుత్వ సదుపాయాలు, డబ్బులతోనే మేం పిల్లల్ని కంటాము. 

    ఒక్కసారి, మేము మెజారిటీ గా మారిన తర్వాత, అక్కడ కేవలం షరియా మాత్రమే ఉండాలి అని. 

    ఇంకా వాళ్ళు చేసిన వాటినీ white wash చేసి, మతం లేదు అని మీరు కళ్లు మూసుకుంటే , వాళ్ళకే ఇంకా బలం. 

    మనం సహాయం చేస్తే నిలబడిన బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్దితి చూడండి. మీ హిందువుల మీదనే చంపుతున్నారు.

     వాళ్లకి ఇక్కడి ఇండియా ముస్లిం ఒక్కడైనా తప్పు అని నోరు తెరిచి చెప్పాడా ? 

    కనీసం ఇప్పటికైనా నిజాన్ని నిజం గా తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.

  3. దేశాన్ని కేవలం ముస్లిం మతం పేరుతో ముక్కలు చేయిస్తే కూడా , 

    భారత దేశం లో హిందువులు , తమ తోటి ముస్లిం లని తమతో పాటు కాపాడారు, 

    కూర్చోబెట్టి తమ డబ్బుతో పోషించారు.

    ఇప్పుడు, ఆ భారతీయ ముస్లిం ల వంతు వచ్చింది.

    తమ భారత్ దేశం  దేశం కి సపోర్ట్ గా, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిలబడి నోరు తెరిచి, తనకి ముస్లిం మతం ఖురాన్ అల్లా కంటే కూడా భారత దేశం, రాజ్యాంగం, సైన్యం గొప్పవి అని నోరు తెరిచి చెప్పాలి.

    ఎంత మంది , మతం కంటే దేశం గొప్పది అని చెప్పే ముస్లిం, క్రైస్తవులు ఉన్నారు, మన చుట్టూ.

    హిందువు కి బై డిఫాల్ట్ భారతదేశం పూజనీయ స్థలం. ఆయన కూడా  మతం కంటే దేశం గొప్పది అని చెబుతారు.

    1. కానీ, చాలా మంది భారతీయ ముస్లిం లో , పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం లకి సపోర్ట్ గా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, సహాయం చేస్తున్నారు,మన దేశం అంటే మెజారిటీ హిందువులకి వ్యతిరేకంగా, 

      కారణం ముస్లిం మత వ్యాప్తి కోసం.

Comments are closed.