ఎక్స్ క్లూజివ్ – పది కోట్లు వదిలేసిన మెగాస్టార్

భోళాశంకర్ విడుదలయిన రోజు నుంచీ మెగాస్టార్ చిరంజీవి మీద ఒకటే ట్రోలింగ్. నిర్మాత అనిల్ సుంకర ముక్కు పిండి 60 నుంచి 65 కోట్లు వసూలు చేసారన్నది ఆ ట్రోలింగ్ కు కారణం. ఒక…

భోళాశంకర్ విడుదలయిన రోజు నుంచీ మెగాస్టార్ చిరంజీవి మీద ఒకటే ట్రోలింగ్. నిర్మాత అనిల్ సుంకర ముక్కు పిండి 60 నుంచి 65 కోట్లు వసూలు చేసారన్నది ఆ ట్రోలింగ్ కు కారణం. ఒక విధంగా ఇది నిజమే కూడా. 

వాల్తేర్ వీరయ్యకు 55 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో భోళాకు 60 నుంచి 65 మేరకు రెమ్యూనిరేషన్ అడిగారని టాక్. అయితే విడుదల వేళకు నిర్మాత కొండ అడ్వాన్స్, కొంత చెల్లింపు చేసి, ఆఖరికి 10 కోట్లకు ఓ చెక్ ఇచ్చారని తెలుస్తోంది.

ఆ చెక్ ను మండే నాడు బ్యాంక్ కు ప్రెజెంట్ చేయమని అనిల్ సుంకర హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే శుక్రవారం సినిమా విడుదలైతే, నాలుగో రోజు పేమెంట్ చేసేలా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారన్నమాట. అయితే సినిమా రిజల్ట్ మార్నింగ్ షో కే తెలిసి పోయింది. సాయంత్రం వరకు చూసిన మెగాస్టార్ కు నిర్మాత సమస్యలు అర్థం అయ్యాయి.

దాంతో తాను ఇక ఆ పది కోట్ల చెక్ ప్రెజెంట్ చేయనని చెప్పేసారని తెలుస్తోంది. అంటే ఓ విధంగా మెగాస్టార్ 50 కోట్ల రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకున్నట్లు అన్నమాట. కనీసం నిర్మాతకు ఆ మాత్రం రిలీఫ్ వుండడం మంచిదే కదా.

భోళాశంకర్ దారుణమైన ఫ్లాపుగా మిగిలింది. నైజాంలో వాల్తేర్ వీరయ్య ముఫై కోట్లకు పైగా వసూలు చేస్తే భోళాశంకర్ ఏడు కోట్ల దగ్గర ఆగిపోయింది.