ఎక్స్ క్లూజివ్..మహేష్ సినిమా మార్పులు

మొత్తానికి కథ సుఖాంతం అయింది. డిసెంబర్ తొలివారంలో మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు రాబోతోంది. ఈ సంగతి తెలిసిందే. కథ విషయంలో వచ్చిన డిస్కషన్లు అన్నీ మహేష్ సినిమాకు హర్డిల్స్ గా మారాయి. దాంతో…

మొత్తానికి కథ సుఖాంతం అయింది. డిసెంబర్ తొలివారంలో మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు రాబోతోంది. ఈ సంగతి తెలిసిందే. కథ విషయంలో వచ్చిన డిస్కషన్లు అన్నీ మహేష్ సినిమాకు హర్డిల్స్ గా మారాయి. దాంతో పూర్తిగా కొత్త కథను ఫిక్స్ చేసుకోవడంతో లైన్ క్లియర్ అయింది. కానీ దీని వల్ల సినిమా కీలక కాస్ట్ అండ్ క్రూలో మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మొదట అనుకున్న సబ్జెక్ట్ ఫుల్ యాక్షన్ టచ్ వున్న సినిమా. ఈ కథ లో కూడా ఫైట్లు వుంటాయి కానీ అవే కీలకం కాదు. అలాగే మొదటి సినిమాలో మలయాళ హీరో పృధ్వీరాజ్ ను తీసుకునే ప్రయత్నం గట్టిగా చేసారు. కానీ ఇప్పుడు అంత బలమైన నటుడు అవసరం వుందో లేదా అన్నది అనుమానమే.

అలాగే మొదట అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం కెజీఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు వుండకపోవచ్చు. ఎప్పుడూ ఓ సీనియర్ హీరొయిన్ ను తీసుకుంటారు త్రివిక్రమ్. ఈసారి అలాగే మరో పాపులర్ సీనియర్ హీరోయిన్ ను ట్రయ్ చేస్తున్నారు. ఈమె మంచి డ్యాన్సర్ కూడా.

ఇక థమన్ విషయం మాత్రం తేలాల్సి వుంది. థమన్ విషయంలో హీరో మహేష్ కాస్త విముఖతతో వున్నారు. కేవలం త్రివిక్రమ్ రికమెండేషన్ కోసం ఓకె అనాలి. మరి ఓకె అంటారా? అనరా? అన్నది చూడాలి. మొత్తం మీద ఇలా పూల్ ప్రూఫ్ మార్పులతో ఫ్రెష్ గా స్టార్ట్ కాబోతోంది మహేష్-త్రివిక్రమ్ సినిమా.