అరవింద సమేత సినిమాలో మాంచి సిక్స్ బాడీతో షర్డ్ లెస్ గా కనిపించి ఫ్యాన్స్ ను అలరించాడు ఎన్టీఆర్. అలాగే భీమ్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో మాంచి బలమైన ఫిజిక్ తో షర్ట్ లెస్ గా కనిపించాడు. ఇప్పుడు మరోసారి మాంచి కండలు పెంచబోతున్నాడు.
తొలిసారి చేయబోతున్న బాలీవుడ్ సినిమా వార్ 2 కోసం బలమైన కండలు కావాలట. బలమైన గన్స్ పట్టుకునే చేతులు, కండరాలు ఎంత బలంగా వుండాలి. అందుకోసమే జనవరి లో దుబాయ్ లేదా, అమెరికా వెళ్లి, ఈ మేరకు ప్రత్యేకమైన ట్రయినర్ల పర్యవేక్షణ లో కండలు పెంచుతాడట.
నవంబర్ నాటికి దేవర పూర్తి
నవంబర్ నెలాఖరు నాటికి దేవర సినిమా లో ఎన్టీఆర్ పార్ట్ ను ఫినిష్ చేస్తారు. వచ్చే నెల మొదటి వారంలో ఓ పాటను హీరో మీద షూట్ చేస్తారు. ఆ తరవాత గోవా, గోకర్ణంలో దేవర షూట్ వుంటుంది. కొరటాల శివ చాలా వేగంగా దేవర సినిమాను పూర్తి చేసే ప్రయత్నాల్లో వున్నారు.
సినిమాలో ధర్టీ పర్సంట్ సిజి వర్క్ వుంటుదట. దీనికి మూడు నెలలు సమయం పడుతుందని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఆ పనులు ప్రారంభించారు. హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే ఓ పెద్ద సంస్థకు ఈ బాద్యతలు అప్పగించారు.
సినిమాలో నాలుగు పాటలు, ఓ మాంటేజ్ సాంగ్ వుంటుంది. వీటిలో ఎన్టీఆర్ సైఫ్ ఆలీ ఖాన్ మీద 500 మంది డ్యాన్సర్లతో ఓ పాట వుంటుంది. సినిమాకే అది హైలైట్ గా వుంటుందని తెలుస్తోంది.
సినిమా మొత్తం మీద ఆరు ఫైట్లు వుంటాయి. అవన్నీ ఒక్కోటీ ఒక్కో రేంజ్ లో వుంటాయని తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ ఈ సినిమాను చాలా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. దర్శకుడు కొరటాల ఆచార్యతో పోయిన తన ప్రతిష్ట ను నిలబెట్టుకునేలా ఈ సినిమా చేస్తున్నారు.