ఎక్స్ క్లూజివ్ – పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో

అహింస సినిమాతో హీరో అయిపోయాడు కనుక అభిరామ్ దగ్గుబాటి హీరోనే. ఈ హీరో పెళ్లి ఫిక్స్ అయింది. చాలా దగ్గర సంబంధమే. అభిరామ్ తాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్ బాబు కూతురు కూతురినే…

అహింస సినిమాతో హీరో అయిపోయాడు కనుక అభిరామ్ దగ్గుబాటి హీరోనే. ఈ హీరో పెళ్లి ఫిక్స్ అయింది. చాలా దగ్గర సంబంధమే. అభిరామ్ తాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్ బాబు కూతురు కూతురినే అభిరామ్ చేసుకోబోతున్నాడు.

ఇటీవలే మాటలు ఫిక్స్ అయ్యాయి. ఇక నిశ్చితార్థం జరగాల్సి వుంది. త్వరలో నిశ్చితార్ధానికి ముహుర్తం పెడతారు. ఆ తరువాత పెళ్లి ముహుర్తం వుంటుంది. 

ఇండస్ట్రీ టాప్ పీపుల్ లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు ఇద్దరు కుమారుల్లో రెండో వాడు అభిరామ్. కొన్నేళ్ల క్రితం కొన్ని ఆరోపణలు, గ్యాసిప్ లు, వీడియోలతో వార్తల్లోకి ఎక్కాడు. ఆ తరువాత హీరోగా తేజ డైరక్షన్ లో అహింస సినిమా చేసాడు. ఆ సినిమా మార్నింగ్ షో తోనే డిజాస్టర్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రాపర్ గా ట్రయినింగ్ పొంది మరో సినిమా చేసే పనిలో వున్నాడు.

రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్, ఇంకా అనేకానేక వ్యాపారాలు అన్నీ కలిపి వేల కోట్ల ఎంపైర్ వుంది. దానికి వున్న అతి కొద్ది మంది వారసుల్లో అభిరామ్ ఒకరు.