ఎటుచూసినా ఈ హీరోయిన్నే కనిపిస్తోందిగా!

ఆ మధ్య కొన్ని నెలల పాటు కృతి శెట్టి హవా నడిచింది. ప్రస్తుతం శ్రీలీల జోరు కొనసాగుతోంది. అయితే ప్రచారం పరంగా చూసుకుంటే నేహా శెట్టి కూడా లీగ్ లో ముందుకు దూసుకుపోతోంది. ఒకటి…

ఆ మధ్య కొన్ని నెలల పాటు కృతి శెట్టి హవా నడిచింది. ప్రస్తుతం శ్రీలీల జోరు కొనసాగుతోంది. అయితే ప్రచారం పరంగా చూసుకుంటే నేహా శెట్టి కూడా లీగ్ లో ముందుకు దూసుకుపోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలతో రాధిక అలియాస్ నేహా శెట్టి సందడి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.

డీజే టిల్లూ ఇచ్చిన క్రేజ్ తో వరుసపెట్టి సినిమాలకు ఓకే చెప్పింది నేహా షెట్టి. ఆశ్చర్యంగా ఆ సినిమాలన్నీ ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. కార్తికేయ సరసన బెదురులంక అనే సినిమాలో నటించింది నేహా శెట్టి. ఇక కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది.

ఈ 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా, లిరికల్ వీడియోతో దుమ్ముదులుపుతున్నాయి. తాజాగా బెదురులంక ట్రయిలర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతున్నాయి.

బెదురులంక సినిమా ఈనెల 25న రిలీజ్ కానుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలో రూల్స్ రంజన్ కూడా రిలీజ్ అవుతుంది. అలా ఈ 4-5 నెలల గ్యాప్ లో 3 సినిమాలతో అలరించబోతోంది నేహా శెట్టి. 

Click Here For Photo Gallery