8 ఏళ్లకే రక్తం తాగిన టైగర్

తన సినిమాల్లో రవితేజ ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. ఒకే రకమైన అంచనాలు కూడా పెట్టుకుంటాడు. తొలిసారి అతడు టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ…

తన సినిమాల్లో రవితేజ ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. ఒకే రకమైన అంచనాలు కూడా పెట్టుకుంటాడు. తొలిసారి అతడు టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పుడీ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.

తాజాగా రిలీజైన గ్లింప్స్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు. అభేద్యమైన మద్రాసు సెంట్రల్ జైలు నుంచి టైగర్ నాగేశ్వరరావు తప్పించుకున్నాడనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. అతడి తెలివితేటల్ని కూడా ఇందులో ఎలివేట్ చేశారు. వాటితో అతడు రాజకీయాల్లో లేదా క్రీడారంగంలో ఎదిగేవాడని.. కానీ దురదృష్టవశాత్తూ క్రిమినల్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

చిన్నప్పనుంటే టైగర్ నాగేశ్వరరావు నేరప్రవృత్తితో పెరిగాడనే విషయాన్ని కూడా వీడియోలో చూపించారు. రక్తం తాగి పెరిగాడని, అతడ్ని ఆపడం ఎవ్వరితరం కాదంటూ చెప్పుకొచ్చారు. ఇలా భారీ ఎలివేషన్స్ ఇచ్చిన తర్వాత సరికొత్త లుక్ లో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజను పరిచయం చేశారు మేకర్స్.

బ్రిడ్జిపై పరుగులుపెడుతున్న ట్రయిన్ కు కొక్కెం వేసి దాంట్లోకి వెళ్లే సీన్ టోటల్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. టీజర్ లో రవితేజ మేకోవర్ బాగుంది. 70వ దశకానికి తగ్గట్టు ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రాఫీ బాగా సింక్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ ను బాగా ఎలివేట్ చేసింది.

ఇదే వీడియోలో రిలీజ్ డేట్ పై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా చెప్పిన తేదీకి రాదంటూ ఈమధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి ప్రకటించారు.