తెలుగులోకి మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. పాతికేళ్ల మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ మెగా హీరో సాయితేజ్ సరసన నటించేందుకు ఎంపికయింది.
ఇప్పటి వరకు మలయాళ, తమిళ, కన్నడ సినిమాల్లో పనిచేసిన ఈ హీరోయిన్ కు తెలుగులో ఇది రెండో సినిమా. ఇప్పటికే ఓ సినిమాను కళ్యాణ్ రామ్ సరసన చేస్తోంది. .
సాయిధరమ్ తేజ్ నటించే 15వ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. దేవా కట్టా డైరక్షన్ లో రిపబ్లిక్ సినిమాను పూర్తి చేసారు. ఇది విడుదల కావాల్సి వుంది.
సుకుమార్ రైటింగ్స్ సినిమా షూట్, రిపబ్లిక్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేయాల్సి వుంది.