అనిల్ రావిపూడి-దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 రాబోతోంది. దీని మీద గట్టి అంచనాలు వున్నాయి. డబ్బుల చుట్టూ తిరిగే పాయింట్ తో అనిల్ మాంచి స్క్రిప్ట్ తయారుచేసినట్లు బోగట్టా. ఇదిలా వుంటే హీరో వెంకటేష్ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ వదిలారు. హీరోలు వెంకీ, వరుణ్ ఇద్దరూ గార్బేజ్ ట్రాలీల్లో డబ్బులు పోసుకుని వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్ డిజైన్ చేసారు.
సినిమాలో కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఫన్, ఫస్ట్రేషన్, ఫార్ట్యూన్ అనుకోవాలేమో ఎఫ్ 3 అంటే. సరే ఈ పోస్టర్ చూసిన తరువాత సింబాలిజం సంగతి సరే, హీరోలు ఇద్దరి మీదా నిర్మాత సెటైర్ వేసారా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సీక్వెల్ కావడంతో తాము కచ్చితంగా నటించడానికి ఒప్పుకోవాల్సి వుండడంతో, హీరోలు ఇద్దరూ మామూలుగా డిమాండ్ చేయలేదని పలు గ్యాసిప్ లు వున్నాయి.
వెంకీ తరపును సురేష్ బాబు నిర్మాణంలో భాగస్వామ్యం కోరారని, ఆఖరికి ఏం ఒప్పందం కుదిరిందో అన్నది తెలియదు కానీ, దాని ఫలితంగా వెంకీకి 12 కోట్లకు పైగా ముడతాయని గ్యాసిప్ లు వినిపించాయి. దాని తరువాత వరుణ్ తేజ్ కూడా గట్టిగా డిమాండ్ చేసారని, ఆఖరికి ఎనిమిది కోట్ల దగ్గర సెటిల్ అయిందనే గ్యాసిప్ లు వినిపించాయి.
అంటే హీరోలు ఇద్దరూ ట్రాలీలతో డబ్బులు తీసుకెళ్తున్నారన్నమాట ఈ సినిమాతో. ఆ విషయమే పోస్టర్ లో చెప్పినట్లు అయింది నిర్మాత దిల్ రాజు అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.