పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిబ్రవరిలో 20 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుండబోతున్నారు. ఇరవై రోజుల పాటు మొహానికి మేకప్ వేసుకుని సినిమా షూటింగ్ ల్లో బిజీ కాబోతున్నారు. ఈ నెల 20న పింక్ రీమేక్ సెట్ మీదకు వెళ్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సినిమాలో హీరో లేకుండా దాదాపు 40 రోజులు వర్క్ వుంది. అందుకే ముందుగా ఈనెల 20 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే నెలలో 10 రోజులు కాల్ షీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్.
రెండు సినిమాలు సమాంతరంగా
ఇదిలావుంటే క్రిష్ డైరక్షన్ లో మరో సినిమా కూడా పవన్ ఒకె చేసిన సంగతి తెలిసిందే.ఆ సినిమాను కూడా పింక్ తో పాటు సమాంతరంగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ముందుగా 10 రోజులు దిల్ రాజు పింక్ సినిమాకు ఇచ్చి, ఆ వెంటనే 10 రోజులు క్రిష్ సినిమాకు కేటాయించారు. అంటే వరుసగా 20 రోజులు పవన్ షూటింగ్ ల్లోనే గడపబోతున్నారు. అందువల్ల ఇక రాజకీయాల హడావుడికి ఆయన కాస్త దూరంగా వుండే అవకాశం వుంది.
50 కోట్లు + షేర్
దిల్ రాజు సినిమాకు పవన్ 50 కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో కొంత శాతం వాటా తీసుకోబోతున్నారు. ఆ శాతం ఎంత అన్నది మాత్రం వారిద్దరికే తెలిసిన విషయం. అయితే క్రిష్-ఎఎమ్ రత్నం సినిమాకు మాత్రం ఓన్లీ 50 కోట్ల రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకుంటారు. లాభాల్లో వాటా వుండదు. ఇది ఓల్డ్ కమిట్ మెంట్ కాబట్టి ఈ మేరకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంటే 2020 లో పవన్ కు 100 కోట్ల ఆదాయం వుంటుందన్నమాట.
ఫైట్లు, పాటలు కూడా
పింక్ రీ మేక్ లో పవన్ రెండు మూడు ఫైట్లు కూడా చేస్తారని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కు అంత ఎక్కువ ప్రాధాన్యత వుండకపోయినా, ఓ పాట కూడా వుంటుంది. పవన్ మరోసారి తన ఫ్యాన్స్ కోసం ఓ డ్యూయట్ చేయబోతున్నారు. ఈ మేరకు పవన్ కు సరిపోయే హీరోయిన్ కోసం వెదుకులాట ప్రారంభమైంది. పవన్ ఇమేజ్ కు సరిపడా ఫెమిలియర్ ఫిగర్ కోసం వెదుకుతున్నారు. బాగుంటే కొత్త అమ్మాయిని పరిచయం చేసే ఆలోచన కూడా వుంది