Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ రూల్స్ నీకు వర్తించవా సురేష్ బాబు

ఆ రూల్స్ నీకు వర్తించవా సురేష్ బాబు

వెంకీమామ.. థియేటర్ లో విడుదల డిసెంబర్ 13.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల జనవరి 12..సరిగ్గా 4 వారాల గ్యాప్ లో వెంకీమామ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షమైంది. నిజానికి ఏ సినిమానూ విడుదలైన 7 వారాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. చిన్న సినిమా నిర్మాతలు డబ్బులకు కక్కుర్తిపడి, నిబంధనల్ని అతిక్రమించి నెల రోజులకే డిజిటల్ కు ఇచ్చేస్తున్నారు. కానీ సురేష్ బాబు లాంటి నిర్మాత కూడా ఇలా ప్రవర్తించడం బాధాకరం.

మైక్ దొరికితే రూల్స్-రెగ్యులేషన్స్ అంటూ క్లాస్ పీకే సురేష్ బాబు.. వెంకీమామ సినిమా విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. నిజానికి 7 వారాల గడువు కంటే కాస్త ముందే (నెల రోజులకే) డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేస్తే కాస్త ఎక్కువ మొత్తం వస్తుంది. ఆ కాస్త ఎక్కువ మొత్తానికి సురేష్ బాబు కక్కుర్తి పడ్డారనే విషయం అర్థమౌతూనే ఉంది.

బడా నిర్మాతగా, ఇండస్ట్రీలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న సురేష్ బాబే ఇలా నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఇక చిన్న సినిమాల నిర్మాతలు ఊరుకుంటారా? అప్పుడు నిర్మాతల మండలికి ఇండస్ట్రీ ఏం గౌరవం ఇస్తున్నట్టు? ఎవరికి వారు ఇలా నిబంధనల్ని అతిక్రమిస్తూ పోతే పరిశ్రమ ఏమవ్వాలి? చొరవ తీసుకొని, అందరికీ మార్గదర్శకంగా నిలవాల్సిన సురేష్ బాబు ఇలా చేస్తే ఎలా? ఈ సినిమాకు పీపుల్ మీడియా కూడా సహ-నిర్మాతగా వ్యవహరించినప్పటికీ అగ్రిమెంట్ మీద సురేష్ బాబు కూడా సంతకం పెట్టే ఉంటారు కదా. కాబట్టి ఆయనదే తప్పు.

కొన్ని రోజుల కిందట ఇదే అవకాశం సైరా సినిమాకు కూడా వచ్చింది. నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే, 5 కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధపడింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. కానీ నిర్మాత రామ్ చరణ్ ఆ తప్పు చేయలేదు. కానీ సురేష్ బాబు మాత్రం వెనకముందు ఆలోచించలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?