నిధి అగర్వాల్.. అందుకు ఒప్పుకోక తప్పలేదు

పాపం కొందరు హీరోయిన్ల పరిస్థితి ఇంతే. మంచి హిట్ కొట్టినా నలుగురి దృష్టిలో పడలేదు. క్రేజీ సినిమాలు ఆకర్షించలేరు. మొన్నటికిమొన్న ప్రియాంక జవాల్కర్ అనే అమ్మాయి పరిస్థితి ఇలానే తయారైంది. టాక్సీవాలా హిట్ అయినా…

పాపం కొందరు హీరోయిన్ల పరిస్థితి ఇంతే. మంచి హిట్ కొట్టినా నలుగురి దృష్టిలో పడలేదు. క్రేజీ సినిమాలు ఆకర్షించలేరు. మొన్నటికిమొన్న ప్రియాంక జవాల్కర్ అనే అమ్మాయి పరిస్థితి ఇలానే తయారైంది. టాక్సీవాలా హిట్ అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలానే తయారైంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ తర్వాత కూడా ఆమెకు క్రేజీ ఆఫర్లు రావడం లేదు

ఇస్మార్ట్ వచ్చి వంద రోజులైంది. సినిమా టీవీల్లో కూడా వచ్చేసింది. కానీ నిధి అగర్వాల్ మాత్రం బడా ఆఫర్లు అందుకోలేకపోయింది. కేవలం స్టార్ హీరోల సరసన ఛాన్స్ కోసమే ఇన్నాళ్లూ ఖాళీగా ఉంది ఈ అమ్మడు. కానీ ఎన్నాళ్లు వెయిట్ చేసినా ఉపయోగం లేదని మొన్ననే తెలుసుకుంది. అందుకే ఓ కొత్త హీరో సరసన నటించడానికి ఓకే చెప్పింది.

గల్లా జయదేవ్ కొడుకు, మహేష్ మేనల్లుడు అశోక్ హీరోగా మారుతున్నాడు. రేపు ఆ సినిమా లాంఛ్ కాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నటించడానికి నిధి ఒప్పుకుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి పెద్ద హిట్ తర్వాత ఇలా కొత్త హీరో సినిమాలో నటించడం కొందర్ని ఆశ్చర్యపరిచినప్పటికీ, పరిస్థితులు నిధికి అనుకూలంగా లేవు మరి.

అయితే బడా హీరో సినిమాలో ఛాన్స్ రాకపోయినా, భారీ పారితోషికం మాత్రం పట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అలా వచ్చిన అవకాశాలతో కెరీర్ ను నెట్టుకొచ్చేస్తోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.