ఫన్..రొమాంటిక్..ఎమోషనల్

కుర్రకారు ఫన్..దాంట్లో రొమాంటిక్ టచ్…ఆపై చిన్న ఎమోషన్, ఇలా మూడు కలగలిపి, పెర్ ఫెక్ట్ గా బ్లెండ్ చేయాలే కానీ భలే ఇంట్రస్ట్ గా వుంటుంది. ఇదే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్…

కుర్రకారు ఫన్..దాంట్లో రొమాంటిక్ టచ్…ఆపై చిన్న ఎమోషన్, ఇలా మూడు కలగలిపి, పెర్ ఫెక్ట్ గా బ్లెండ్ చేయాలే కానీ భలే ఇంట్రస్ట్ గా వుంటుంది. ఇదే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా ట్రయిలర్ చూ్స్తుంటే. ఆఖిల్-పూజా హెగ్డే జంటగా తయారైన బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఇది.

పెళ్లి మీద తనకు క్లారిటీ వుందనుకునే పెళ్లి కొడుకు..వరుసగా చూసే పెళ్లి చూపులు..వాటిల్లోంచి పుట్టే ఫన్…అంతలోనే సెట్ అయిన అమ్మాయి…అక్కడి నుంచి రొమాంటిక్ టచ్…అలా అలా ముందుకు వెళ్తుంటే కాస్త ఎమోషనల్ ఫీలింగ్స్.

ట్రయిలర్ లో ఇవన్నీ బాగానే మిక్స్ అయ్యాయి. గెస్ట్ పెళ్లి కూతుళ్లుగా పలువురు యంగ్ హీరోయిన్లు కనిపించడం యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. హీరో అఖిల్ లుక్స్ క్యూట్ గా వున్నాయి. పూజా అందాలు, కవ్వింపులు, చూపులు తెలిసిందే. మరోసారి ఆ మ్యాజిక్ ఇందులోనూ కనిపించింది.

లోకం సర్దుకుపో అంటుంది..మందను వదిలి కొత్తదారిని పట్టుకుని నేను వెళ్తున్నా..మీరూ రండి అనే డైలాగుతో  ఎండ్ చేయడం ద్వారా, ప్రేక్షకులకు ట్రయిలర్ లో చెప్పనది ఏదో వుంది అని అర్థం అవుతోంది. అదేంటో దసరా టైమ్ లో బరిలోకి దిగుతున్న బ్యాచులర్ ను చూస్తే కానీ తెలియదు.