అయ్యన్న ఇలాకాలో అలాగనా… ?

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చంద్రబాబు మాదిరిగానే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. ఆయన అనేక పర్యాయాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసారు. గత ఎన్నికల్లో ఆయన భారీ ఓట్ల తేడాతో ఓడారు. Advertisement ఇదిలా…

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చంద్రబాబు మాదిరిగానే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. ఆయన అనేక పర్యాయాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసారు. గత ఎన్నికల్లో ఆయన భారీ ఓట్ల తేడాతో ఓడారు.

ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాలుగా అయ్యన్న కుటుంబం చేతిలో ఉన్న నర్శీపట్నం మునిసిపాలిటీ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో చేజారింది. ఇక్కడ తొలిసారిగా వైసీపీ జెండా ఎగిరింది. 

తాజాగా జరిగిన కౌన్సిల్ సమవేశంలో అయ్యన్న నివసిస్తున్న వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ సహా అనేక సమస్యలను ఆయన సతీమణి, వార్డు టీడీపీ కౌన్సిలర్ పద్మావతి ప్రస్తావించారు. దానికి వైసీపీ కౌన్సిలర్లు ధీటుగానే బదులివ్వడమే ఇక్కడ విశేషం. 

అయ్యన్న ఎన్నో సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు. రెండేళ్ల క్రితం వరకూ ఆయన కుటుంబంలో నాలుగు అధికార పదవులు ఉన్నాయి. అయినా కూడా తన సొంత వార్డుతో పాటు నర్శీపట్నంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోయారంటూ వైసీపీ కౌన్సిలర్లు చేసిన కామెంట్స్ నిజంగానే మంట పుట్టించేవే.

అంతే కాదు ఇపుడు తమ మీద విమర్శలు చేస్తూ వార్డు అభివృద్ధి కావాలి. నర్శీపట్నం బాగుండాలి అని అయ్యన్న సతీమణితో పాటు టీడీపీ కౌన్సిలర్లు కోరడం కన్నా చిత్రం మరోటి లేదని కూడా సెటైర్లు వేశారు. 

మొత్తానికి పాడైన నర్శీపట్నం డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు అయ్యన్న సొంత వార్డు అభివృద్ధి కి కూడా తాము కట్టుబడి ఉన్నామంటూ వైసీపీ కౌన్సిలర్లు ఇచ్చిన పంచ్ కి విపక్ష టీడీపీ తెగ ఇబ్బంది పడిపోయిందిగా మరి.