ఒకవైపు స్త్రీలను ఆబ్జెక్టిఫై చేయకూడదని అంటారు.. మరి ఈ యాడ్ ఏంటి? అనే ప్రశ్నలు పడుతున్నాయి. అలాగే.. అండర్ వేర్ బ్రాండ్ ను బట్టి అమ్మాయిలు ఆకర్షితులు అవుతారా? ఇదేం క్రియేటివిటీ బాబోయ్ అనే సెటైర్లూ పడుతున్నాయి. ఎవరో అడ్రస్ లేని వారు అలాంటి అండర్ వేర్ యాడ్ లో నటించి ఉంటే అదో లెక్క కానీ.. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటుడు విక్కీ కౌశల్, సౌతిండియన్ మోస్ట్ వాంటెడ్ నటి రష్మికలు ఆ యాడ్ లో కనిపించడంతో రన్నింగ్ కామెంట్రీ కొనసాగుతూ ఉంది.
ఆ యాడ్ లో రష్మిక ఒక యోగా ఇన్ స్ట్రక్టర్ గా కనిపిస్తుంది. విక్కీ కౌశల్ ఏమో యోగా చేస్తూ ఉంటాడు. యోగాలో భాగంగా రెండు చేతులూ పైకెత్తే సరికి అతడి అండర్ వేర్ యాడ్ స్ట్రైప్ పైకి కనిపిస్తుంది. దాన్నే చూస్తూ ఉండిపోతుంది రష్మిక. తన కౌంటింగ్ పూర్తయితే ఎక్కడ అతడు చేతులు దించేస్తాడో… ఎక్కడ ఆ అండర్ వేర్ కనపడకుండా పోతుందో అని ఆమె కౌంటింగ్ ను మందకొడిగా చేస్తూ ఉంటుంది. ఆమె చూపు తన అండర్ వేర్ మీద పడిందని అతడు కూడా గ్రహించేస్తాడో! ఇదీ ఆ యాడ్ లో క్రియేటివిటీ లెవల్!
ఇక అదే యాడ్ కు కొనసాగింపుగా మరో బిట్. అందులోనేమో విక్కీ వస్తువులను సెల్ఫ్ లోంచి తీసి పై వైపున పెట్టేసి ఉంటుంది రష్మిక! ఎందుకనుకున్నారు? అతడు తన వస్తువల కోసం చేతులు పైకెత్తుతాడు.. మళ్లీ అతడి అండర్ వేర్ కనిపిస్తుంది అని! ఆ బ్రాండ్ అండర్ వేర్ వేస్తే.. స్త్రీల చూపంతా మీ అండర్ వేర్ మీదే ఉంటుందనేది ఈ యాడ్ ల సారాంశం!
ఏకంగా ప్రముఖ నటీనటులతో ఈ యాడ్ చేశారు. ఎవరో అవకాశాలు లేని వారు ఇలాంటి పాట్లు పడితే ఏదోలే అనుకోవచ్చు. అయితే ఈ పరమ థర్డ్ గ్రేడ్ క్రియేటివిటీకి వీళ్లిద్దరూ ఎలా ఒప్పుకున్నారో అనుకోవాలి. అలాగే.. అండర్ వేర్ స్ట్రైప్ చూపిస్తే.. అమ్మాయిలు ఆకర్షిస్తారనే ఈ యాడ్ పరామార్థం కూడా థర్డ్ గ్రేడ్ కు దిగువ స్థాయిలోనే ఉంది. ఈ యాడ్ ను చూసి విస్తుపోతున్న నెటిజన్లు రష్మిక, విక్కీ కౌశల్ లపై సెటైర్లు పేలుస్తున్నారు.