Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ..ఫ..ఫ... అంటూ మొత్తం చెప్పేశారుగా

ఫ..ఫ..ఫ... అంటూ మొత్తం చెప్పేశారుగా

గాలి సంపత్.. ఈ టైటిల్ ఏంటి.. అసలు టైటిల్ పాత్రధారి ఎవరు? ఇలాంటి విషయాలేవీ సస్పెన్స్ లో పెట్టదలుచుకోలేదు యూనిట్. సినిమాలో గాలిసంపత్ పాత్రధారి శ్రీవిష్ణు కాదు, రాజేంద్రప్రసాద్. అంతేకాదు.. గాలి అనే బిరుదు ఎందుకొచ్చిందో కూడా చెప్పేశారు.

ఈరోజు రిలీజైంది గాలిసంపత్ ట్రయిలర్. ఇందులో అన్ని విషయాల్ని పూసగుచ్చినట్టు చెప్పేశారు. టైటిల్ పాత్రధారి రాజేంద్రప్రసాద్ పేరు గాలిసంపత్. అతడికి మాటలు రావు. మాట్లాడితే "ఫ..ఫ..ఫ" అంటూ నోటి లోంచి గాలి వస్తుంది తప్ప సౌండింగ్ ఉండదు. ఆ గాలికి అసలు అర్థాన్ని సత్య తన మాటల్లో చెబుతుంటాడు.

రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు తండ్రికొడుకులు. మధ్యలో లవ్లీ సింగ్ తో లవ్ స్టోరీ. అంతలోనే అరకులో ప్రకృతి వైపరీత్యం. మాటలు రాని గాలిసంపత్ తప్పిపోవడం. తండ్రికొడుకుల మధ్య కామెడీనే కాదు, మంచి ఎమోషనల్ బాండింగ్ కూడా ఉందని చెప్పడం. వెరసి.. గాలిసంపత్ లో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయంటూ ట్రయిలర్ లో చెప్పేశారు.

ఇవి కాకుండా ఇంకా ఏమేం ఉన్నాయో కావాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యవేక్షణ అంటూ అనీల్ రావిపూడి పేరిట పడిన పెద్ద టైటిల్ కార్డు ఒక్కటే ఈ సినిమాకు అతిపెద్ద ప్రచారాస్త్రం. 

<iframe width="100%" height="365" src="https://www.youtube.com/embed/tN2yZnCBCsU" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?