గాలి సంపత్..ఓ ఫ్యామిలీ ఎమోషన్

ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. తొలిసారి తాను కథ మాటలు అందిస్తూ, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సినిమా గాలి సంపత్. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన కొద్ది నిమషాలు…

ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. తొలిసారి తాను కథ మాటలు అందిస్తూ, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సినిమా గాలి సంపత్. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన కొద్ది నిమషాలు గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు. 

గాలి సంపత్ ఓ విభిన్న ప్రయోగం అని, తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ నే ఈ సినిమాకు కథాంశమని ఆయన అన్నారు. ఇది తన మార్కు సినిమా కాదు, అని తనకు తట్టిన ఓ మంచి పాయింట్ ఆధారంగా అల్లుకున్న విభిన్నమైన కథ అని ఆయన అన్నారు. 

శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ రెండు పాత్రలూ చాలా కీలకమైనవి అని, సినిమాకు క్లయిమాక్స్ కీ రోల్ ప్లే చేస్తుందని, అది కనుక ప్రేక్షకులకు నచ్చితే ఈ సినిమా ఓ రేంజ్ హిట్ అవుతుందని ఆయన అన్నారు. ఈ క్లయిమాక్స్ కోసం చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ గ్రాఫిక్స్ అందించామన్నారు. బోర్ బావి సెట్ వేసి, దానికి అన్ని విధాల ఎఫెక్ట్ లు జోడించడానికి గ్రాఫిక్స్ సాయం తీసుకున్నామన్నారు.

వాస్తవానికి తను కథ, మాటలు అందించానని, తనతో జర్నీ చేస్తున్న స్నేహితుడు సాయి కోసం ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ కార్డ్ వేసుకున్నానని వెల్లడించారు. అయితే దర్శకుడు అనీష్ పూర్తి స్వేచ్చతో సినిమాను రూపొందించారన్నారు. తన స్నేహితుడు ఓ నిర్మాతగా హ్యాపీ అవ్వాలని, కోన్నవారు హ్యపీగా వుండాలని, తనేమీ ఈ ప్రాజెక్టు మీద ఆదాయం ఆశించడం లేదని కూడా అనిల్ స్పష్టం చేసారు.

ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా మీద బిజీగా వున్నానని, ఆ తరువాతే మహేష్ బాబుతో సినిమానా? బాలయ్యబాబుతో సినిమానా అన్నది ఆలోచిస్తానని ఆయన చెప్పారు. విమర్శలు, కామెంట్లు ఇలాంటివి ఏమీ పెద్దగా మనసుకు తీసుకోనని, పని చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతానని అల్టిమేట్ గా జనం మన సినిమాను సక్సెస్ చేసారా లేదా అన్నదే చూస్తానని ఆయన చెప్పారు.