శర్వానంద్ హీరోగా తయారైన సినిమా శ్రీకారం. ఈ సినిమా చాలా వరకు పచ్చని పంటచేలల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు పడిన కష్టాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ వెల్లడించారు.
తిరుపతి వెంకన్న ఏడు కొండలు కనిపించేలా నలభై ఎకరాల భూమిని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తీసుకుని, రకరకాల పంటలు పండించారని చెప్పారు. కానీ కరోనా కారణంగా ఆ పంటల సీజన్ ముగిసిపోవడంతో, మళ్లీ మళ్లీ పంటలు పండించాల్సి వచ్చిందని చెప్పారు.
ఆ విధంగా శ్రీకారం సినిమా కోసం నిజంగా వ్యవసాయం చేయాల్సి వచ్చిందని, అదే విధంగా నలభై ఎకరాల్లో పంటల పండించి, సినిమా సెట్ కింద మార్చడం అన్నది సినిమా చరిత్రలో ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు. కాలానికి ఎదురీది, పంటలు పండించి సినిమా చేయడం అంటే కచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం అని నరేష్ చెప్పారు.
శర్వానంద్ సరసన ప్రియాంక నటించిన ఈ సినిమాను రామ్ ఆచంట..గోపీ ఆచంట తమ 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.