నిర్మాత దిల్ రాజు సహనానికి పరీక్ష పెడుతున్న సినిమా గేమ్ ఛేంజర్. కమల్ విక్రమ్ సినిమా హిట్ కాకపోయి వుంటే ఏ గొడవా లేకపోవును. అది బ్లాక్ బస్టర్ కావడంతో ఇండియన్ 2 తెరమీదకు వచ్చింది.
అది వుండదనుకుని గేమ్ ఛేంజర్ ను తలపెట్టిన దిల్ రాజు కు ఇలా జరగడం అన్నది కాస్త టెన్షన్ కలిగించే విషయమే. మొత్తానికి షూటింగ్ ప్రారంభమైంది. జరుగుతోంది.. జరుగుతోంది.. జరుగుతోంది. కానీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది చరణ్ ఫ్యాన్స్ కు టెన్షన్ పాయింట్ .
లేటెస్ట్ ఇన్ ఫో ఏమిటంటే ఏప్రిల్ నాటికి చరణ్ పార్ట్ పూర్తి కావచ్చు అని తెలుస్తోంది. మహా అయితే మరో నెల అంటే మే ఎండింగ్ కు చరణ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ తరువాత మరో నెల రోజులు చరణ్ లేని షూట్ వుంటుందని తెలుస్తొంది. అంటే జూన్ నాటికి షూటింగ్ వర్క్ పూర్తవుతుంది. ఇక శంకర్ పెర్ ఫెక్షన్ కోసం పోస్ట్ ప్రోడక్షన్ రెండు మూడు నెలలు తీసుకున్నా దసరా వేళకు సినిమా విడుదల కావడానికి చాన్స్ వుంది.
సినిమాను ఎలాగైనా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా వున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంత భారీ సినిమా దసరా డేట్ ను అందుకోలేకపోతే డిసెంబర్ ఎండ్ వేళకు విడదుల చేయాల్సి వుంటుంది.